AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WhatsApp వాటర్ బిల్లు మెసేజ్‌తో రూ.4.19 లక్షలు మాయం.. OTP చెప్పకుండానే రిటైర్డ్ ఉద్యోగికి భారీ షాక్!

Water Bill Scam: వాట్సాప్‌లో వచ్చిన నకిలీ వాటర్ బిల్లు మెసేజ్‌ను నమ్మిన రిటైర్డ్ బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగి రూ.4.19 లక్షలు కోల్పోయాడు. OTP చెప్పకపోయినా ఫోన్‌లో మాల్వేర్ యాప్ ఇన్‌స్టాల్ చేసి సైబర్ నేరగాళ్లు బ్యాంకు ఖాతా నుంచి డబ్బు దోచేశారు. ఈ ఘటనపై సైబర్ పోలీసులు కీలక హెచ్చరికలు జారీ చేశారు.

WhatsApp వాటర్ బిల్లు మెసేజ్‌తో రూ.4.19 లక్షలు మాయం.. OTP చెప్పకుండానే రిటైర్డ్ ఉద్యోగికి భారీ షాక్!
Fake Water Bill Message
Ranjith Muppidi
| Edited By: |

Updated on: Jul 08, 2026 | 12:42 PM

Share

వాట్సాప్‌లో వచ్చిన ఓ నకిలీ వాటర్ బిల్లు మెసేజ్‌ను నమ్మిన రిటైర్డ్ ఉద్యోగి సైబర్ మోసగాళ్ల వలలో చిక్కుకుని రూ.4.19 లక్షలు కోల్పోయాడు. ఓటీపీ చెప్పకపోయినా, యాప్‌ల రూపంలో మాల్వేర్‌ను ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసి బ్యాంకు ఖాతాలోని నగదును కాజేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఎల్‌బీనగర్ సమీపంలోని రాక్‌టౌన్ కాలనీలో నివసించే ఓ రిటైర్డ్ బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగికి జూలై 1న వాట్సాప్‌లో ఓ మెసేజ్ వచ్చింది. అందులో “హైదరాబాద్ వాటర్ బోర్డు తాగునీటి బిల్లు చెల్లించలేదు.. వెంటనే చెల్లించకపోతే నీటి కనెక్షన్ నిలిపివేస్తాం” అని పేర్కొంటూ, సహాయం కోసం ఒక ఫోన్ నంబర్ కూడా ఇచ్చారు. ఆందోళన చెందిన బాధితుడు ఆ నంబర్‌కు కాల్ చేయగా, అవతలి వ్యక్తి తనను వివేక్ శర్మగా పరిచయం చేసుకుని వాటర్ మీటర్ కేవైసీ అప్డేట్ చేయాల్సి ఉందని చెప్పాడు. ఆ ప్రక్రియ పేరుతో బాధితుడి యూపీఐ వివరాలు, ఎస్‌బీఐ బ్యాంకు ఖాతా సమాచారం, ఏటీఎం కార్డు వివరాలు తీసుకున్నాడు.

కొంతసేపటికి అనుమానం వచ్చిన బాధితుడు కాల్‌ను నిలిపివేశాడు. అయితే అప్పటికే వాటర్ బోర్డు అధికారిక యాప్‌ల మాదిరిగా కనిపించే రెండు నకిలీ మొబైల్ యాప్‌లు అతని ఫోన్‌లో ఇన్‌స్టాల్ అయ్యాయి. బాధితుడు ఎలాంటి ఓటీపీ, పిన్ లేదా పాస్‌వర్డ్ చెప్పకపోయినా, ఆ యాప్‌ల సహాయంతో సైబర్ నేరగాళ్లు అతని బ్యాంకు ఖాతా నుంచి మొత్తం రూ.4.19 లక్షలు అక్రమంగా బదిలీ చేశారు. మోసపోయానని గ్రహించిన బాధితుడు వెంటనే మల్కాజిగిరి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

సైబర్ పోలీసుల సూచనలు

  • వాట్సాప్, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా వచ్చే బిల్లు చెల్లింపు సందేశాలను వెంటనే నమ్మవద్దు.
  • అధికారిక వెబ్‌సైట్ లేదా అధికారిక మొబైల్ యాప్ ద్వారానే బిల్లులు చెల్లించాలి.
  • అపరిచితులు చెప్పిన యాప్‌లను ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేయవద్దు.
  • యూపీఐ, బ్యాంకు ఖాతా, ఏటీఎం కార్డు వివరాలను ఎవరికీ చెప్పకూడదు.
  • అనుమానాస్పద లావాదేవీలు జరిగితే వెంటనే 1930 సైబర్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలి. లేదా సమీప సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించాలి.

Follow Us
WhatsAppలో నకిలీ వాటర్ బిల్లు మెసేజ్.. ఒక్క క్లిక్‌తో 4 లక్షలు..
WhatsAppలో నకిలీ వాటర్ బిల్లు మెసేజ్.. ఒక్క క్లిక్‌తో 4 లక్షలు..
ఎనర్జీ డ్రింక్స్‌పై తాగే వారికి హెచ్చరిక!డార్క్ రియాలిటీ తెలిస్తే
ఎనర్జీ డ్రింక్స్‌పై తాగే వారికి హెచ్చరిక!డార్క్ రియాలిటీ తెలిస్తే
ఇంగ్లాండ్‌లోనే ముగిసిన ఈ ముగ్గురి కెరీర్.. పిలిచి ఛాన్స్ ఇస్తే..
ఇంగ్లాండ్‌లోనే ముగిసిన ఈ ముగ్గురి కెరీర్.. పిలిచి ఛాన్స్ ఇస్తే..
పెంపకం కేంద్రం నుంచి తప్పించుకున్న 900 పాములు!
పెంపకం కేంద్రం నుంచి తప్పించుకున్న 900 పాములు!
సౌత్‌ టాలెంట్ మీద ఆశలు.. బాలీవుడ్‌లో నయా ట్రెండ్‌
సౌత్‌ టాలెంట్ మీద ఆశలు.. బాలీవుడ్‌లో నయా ట్రెండ్‌
వర్షాకాలంలో స్పైసీ స్నాక్.. చెట్టినాడ్ స్టైల్ రొయ్యల ఫ్రై
వర్షాకాలంలో స్పైసీ స్నాక్.. చెట్టినాడ్ స్టైల్ రొయ్యల ఫ్రై
భర్తను కాదని ప్రియుడితో పారిపోవాలనుకునే భార్య.. క్షణ క్షణం ఉత్కంఠ
భర్తను కాదని ప్రియుడితో పారిపోవాలనుకునే భార్య.. క్షణ క్షణం ఉత్కంఠ
నెలలోపే ఓటీటీలో... బిగ్‌ స్క్రీన్‌కు భారీ గండి
నెలలోపే ఓటీటీలో... బిగ్‌ స్క్రీన్‌కు భారీ గండి
తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ప్రాక్టికల్ పరీక్షల..
తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ప్రాక్టికల్ పరీక్షల..
గంభీర్‌కు ఇచ్చిపడేసిన ఫ్యాన్స్.. చుట్టుముట్టి మరీ ఏం చేశారంటే?
గంభీర్‌కు ఇచ్చిపడేసిన ఫ్యాన్స్.. చుట్టుముట్టి మరీ ఏం చేశారంటే?