Khammam: పూజలు చేస్తాం.. దరిద్రాన్ని వదిలిస్తాం.. అంటూ ఇంటికొచ్చారు.. కట్ చేస్తే..

|

Dec 21, 2022 | 9:21 AM

దొంగబాబాల ఆగడాలకు అడ్డే లేకుండా పోతోంది. రోజుకోచోట మోసం బయటపడుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రాజస్థానీ దొంగ స్వాములు హల్‌చల్‌ చేశారు.

Khammam: పూజలు చేస్తాం.. దరిద్రాన్ని వదిలిస్తాం.. అంటూ ఇంటికొచ్చారు.. కట్ చేస్తే..
Fake Baba
Follow us on

దొంగబాబాల ఆగడాలకు అడ్డే లేకుండా పోతోంది. రోజుకోచోట మోసం బయటపడుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రాజస్థానీ దొంగ స్వాములు హల్‌చల్‌ చేశారు. పూజలు చేస్తాం, మీకు పట్టిన దరిద్రం వదిలిస్తాం, మీ కష్టాలన్నీ పోగొడతామని నమ్మబలికి జనాన్ని ముంచేశారు. ఖమ్మం టూటౌన్‌లో ఈ ఇన్సిడెంట్‌ జరిగింది. పూజల పేరుతో ప్రజలను మోసంచేసి బంగారంతోపాటు కారును ఎత్తుకెళ్తుండగా ఛేజ్‌చేసిమరీ పట్టుకున్నారు పోలీసులు.. ముగ్గురు దొంగల్లో ఒకరు అచ్చం స్వామీజీలా వేషం వేసుకుని వచ్చాడు. నకిలీ స్వామీజీకి మరో ఇద్దరు తోడుగా వచ్చాడు. మీకు ఆ దోషం ఉంది, ఈ దోషం ఉంది, పూజలుచేసి వాటిని తొలగిస్తామంటూ నమ్మబలికారు.

దొంగబాబాల మాటలను నమ్మిన కొందరు, దొంగ స్వామీజీలు చెప్పినట్టు చేశారు. పూజల పేరుతో ఇంట్లో ఉన్న బంగారాన్ని మొత్తాన్ని బయటికి తీయించారు. పూజలు చేస్తున్నట్లు నటిస్తూనే బంగారంతో మాయమయ్యారు. వెళ్తూవెళ్తూ ఓ కారును కూడా చోరీ చేశారు దొంగస్వాములు. ఈ విషయం ఖమ్మం అంతటా స్ప్రెడ్ అవడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎక్కడికక్కడ వెహికల్స్‌ చెకింగ్స్‌ చేపట్టారు. కారులో పారిపోతున్న దొంగ బాబాలను పట్టుకునేందుకు ఛేజింగ్‌లు చేశారు.

చివరికి కొత్తగూడెం పోస్టాఫీస్ సెంటర్‌లో కారును పట్టుకున్నారు పోలీసులు. ఇద్దరు దొంగ స్వామీజీలను అదుపులోకి తీసుకుని, కారు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పారిపోయిన మూడో పర్సన్‌ కోసం గాలిస్తున్నారు. దొంగ స్వామీజీల విషయం ఖమ్మంలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ వార్త సోషల్‌ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్‌ కావడంతో పోలీసులు ఫాస్ట్‌గా రియాక్టై వాళ్లను పట్టుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..