సింగరేణి గనిలో పేలుడు సంభవిచింది. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని సింగరేణి ఆర్కే 5బి గనిలో ఈ ప్రమాదం జరిగింది. గనిలో బొగ్గును వెలికితీసేందుకు పలుచోట్ల చోట్ల పేలుడు పదార్థాలు ఉపయోగించారు.
కేబుల్‌వైర్ కనెక్షన్ ఇచ్చే క్రమంలో బ్లాస్టింగ్ మిస్ ఫైర్ జరిగింది. దీంతో పేలుడు సంభవించి ఐదుగురు సింగరేణి కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని రత్నం, లింగయ్య, రాజం, సుమన్, శ్రీకాంత్‌గా సింగరేణి అధికారులు గుర్తించారు.
పేలుడులో గాయపడినవారిని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. పరిస్థితి విషమంగా ఉన్నవారిని హైదరాబాద్ తరలిస్తోంది సింగరేణి యాజమాన్యం.