Etela Rajender: ఈటెల రాజేందర్‌కు మరో కీలక నేత మద్ధతు.. అయితే బీజేపీకి మాత్రం కాదంటూ..

Etela Rajender: హుజూరాబాద్ ఉపఎన్నిక రోజు రోజుకు మరింత సరవత్తరంగా మారుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానప్పటికీ..

Etela Rajender: ఈటెల రాజేందర్‌కు మరో కీలక నేత మద్ధతు.. అయితే బీజేపీకి మాత్రం కాదంటూ..
Etela Rajender

Updated on: Jul 18, 2021 | 3:05 PM

Etela Rajender: హుజూరాబాద్ ఉపఎన్నిక రోజు రోజుకు మరింత సరవత్తరంగా మారుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానప్పటికీ.. నియోజకవర్గం వ్యాప్తంగా ఎలక్షన్ హీట్ కనిపిస్తోంది. హుజూరాబాద్‌లో అధికార పార్టీని ఓడించడమే లక్ష్యంగా అన్ని పార్టీలు ఏకమయ్యేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా హుజూరాబాద్ ఉపఎన్నికల బరిలో ఉన్న మాజీ మంత్రి ఈటెల రాజేందర్‌కు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తన మద్దతు ప్రకటించారు. ఆదివారం నాడు తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌తో హైదరాబాద్ ఆదర్శ్ నగర్ పార్టీ కార్యాలయంలో భేటీఅయిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో హుజురాబాద్ ఎన్నికలు, భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు.

Konda Vishweshwar Reddy

వీరి భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. హుజురాబాద్ ఎన్నికలు పార్టీల మధ్య పోటీ కాదని.. కేసీఆర్, ఈటెల రాజేందర్ మధ్య పోటీ అని పేర్కొన్నారు. ఈటెల రాజేందర్‌కు తమ మద్ధతు ఉంటుందని కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రకటించారు. పార్టీలకు అతీతంగా త్వరలో ఉద్యమకారుల వేదిక పెట్టి హుజురాబాద్‌లో టీఆర్ఎస్ పార్టీని ఓడిస్తామని అన్నారు. లోలోపల అన్ని పార్టీల నాయకులు ఈటెల రాజేందర్‌కు మద్ధతు ఇస్తున్నారని పేర్కొన్నారు. అయితే, ఈటెల రాజేందర్‌కు మాత్రమే తమ మద్ధతు ఉంటుందని, బీజేపీకి కాదని కొండా స్పష్టం చేశారు. ఎట్టిపరిస్థితుల్లో హుజూరాబాద్‌లో కేసీఆర్‌ని ఓడిస్తామన్ని ఉద్ఘాటించారు. ఇందుకోసం అన్ని పార్టీల నాయకుల మద్ధతు కోరుతామని చెప్పారు. ఇదిలాఉంటే.. చెరుకు సుధాకర్ కూడా హుజూరాబాద్ ఎన్నికల్లో ఈటెలకు మద్దతు ఇస్తానని కొండా విశ్వేశ్వర్ రెడ్డికి హామీ ఇచ్చారు.

Also read:

చర్లపల్లి జైల్లో ఖైదీ ఆత్మహత్య.. గత రెండు రోజులుగా అనారోగ్యం.. ఆత్మహత్యపై ఆరా తీస్తున్న జైలు సిబ్బంది

Sanchaita : ‘అశోక్ బాబాయ్ గారూ.. ఆ చర్యలకు మీరు సిగ్గుపడడంలేదా?’ : సంచయిత

Ram Pothineni: మరోసారి ప్రేక్షకులను డ్యూయెల్ రోల్‌లో అలరించడానికి రెడీ అవుతున్న ఎనర్జిటిక్ హీరో