Etela Rajendar Resigned: ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్ రాజీనామా.. ఇవాళ సాయంత్రమే ఢిల్లీ పయనం..!

|

Jun 12, 2021 | 1:09 PM

మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళి అర్పించిన అనంతరం అసెంబ్లీలో రాజీనామా లేఖను అందజేశారు.

Etela Rajendar Resigned: ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్ రాజీనామా.. ఇవాళ సాయంత్రమే ఢిల్లీ పయనం..!
Ex Minister Etela Rajendar Resigned To Mla
Follow us on

Etela Rajendar Resigned as MLA: మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళి అర్పించిన అనంతరం అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయానికి వెళ్లి ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా లేఖను సమర్పించారు. స్పీకర్ ఫార్మేట్‌లో ఉన్న తన రాజీనామా లేఖను అసెంబ్లీ కార్యదర్శికి ఈటల అందజేశారు. అంతకు ముందు గన్‌పార్క్‌ అమరవీరుల స్థూపం వద్దకు భారీగా ఈటల అనుచరులు, కొందరు బీజేపీ నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు. అమరవీరులకు నివాళి అర్పించిన ఈటల రాజీనామా చేశారు.

కాగా.. ఇవాళ సాయంత్రం ఆయన ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈనెల 14న సోమవారం బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లేందుకు ఈటల వర్గం అన్ని ఏర్పాట్లు చేసుకుంది. ఈటలతో పాటు ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, రమేష్ రాథోడ్, తుల ఉమ, మరికొంతమంది నేతలు బీజేపీలో చేరనున్నారు.

Etela Rajendar Resigned To MLA

తెలంగాణలో నియంతృత్వ పాలనకు ఘోరీ కడతాంః ఈటల

అయితే, ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ..  ప్రజాస్వామ్యాన్ని, ప్రజాప్రాతినిధ్య చట్టానికి తూట్ల పొడుస్తూ కొందరు అధికారపార్టీలో కొందరు పదవులు అనుభవిస్తున్నారని వారిలాగా ఉండటం తనకు ఇష్టం లేదన్నారు. విలువలు, నిబద్దతతో కూడిన రాజకీయాలకు కట్టుబడి రాజీనామా చేస్తున్నట్టు మాజీ మంత్రి ఈటల ప్రకటించారు. నా డీఎన్ఏ ఒకప్పుడు లెఫ్ట్‌ కావొచ్చు కానీ.. ఇప్పుడు నా టార్గెట్‌ తెలంగాణలో నియంతృత్వ పాలనకు ఘోరీ కట్టడమేనన్నారు ఈటల. హుజూరాబాద్‌లో జరిగే ధర్మయుద్ధంతో తనకు అండగా ప్రజలు ఉన్నారని ఇందులో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.