Errabelli Dayakar Rao: ‘పల్లె ప్రగతి’తోనే అభివృద్ధి.. రాజకీయాలకు అతీతంగా భాగస్వామ్యం కావాలి: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

|

Jul 01, 2021 | 7:57 PM

Palle Pragathi - Errabelli Dayakar Rao : పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రతిఒక్కరూ రాజ‌కీయాల‌కు అతీతంగా భాగ‌స్వాములు కావాలని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

Errabelli Dayakar Rao: ‘పల్లె ప్రగతి’తోనే అభివృద్ధి.. రాజకీయాలకు అతీతంగా భాగస్వామ్యం కావాలి: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
Errabelli Dayakar Rao
Follow us on

Palle Pragathi – Errabelli Dayakar Rao : పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రతిఒక్కరూ రాజ‌కీయాల‌కు అతీతంగా భాగ‌స్వాములు కావాలని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కోరారు. పల్లె ప్రగతితో గ్రామాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని ఇది నిరంత‌ర ప్రక్రియ అని ఆయన పేర్కొన్నారు. ప‌ల్లెల‌ను ప‌రిశుభ్రంగా, పచ్చదనంతో ఉండేలా స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పంచాయ‌తీ కార్యదర్శలు కృషి చేయాలన్నారు. ప్రతిఒక్కరూ పుట్టి పెరిగిన ఊరు రుణం తీర్చుకోవాలని మంత్రి ఎర్రబెల్లి కోరారు. రాష్ట్రంలోని గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టందుకు ప్రభుత్వం ప్రతినెలా 275 కోట్ల రూపాయ‌లను గ్రాంటుగా విడుద‌ల చేస్తుందని ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొ్న్నారు. గురువారం రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం మండల కేంద్రంలో రూ.50 లక్షల నిధులతో నిర్మించిన బస్సు టెర్మినల్‌ను ప్రారంభించారు. అనంతరం సిరిగిరిపురం గ్రామంలో పల్లె ప్రగతి పనులను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. గతంలో గ్రామంలో పల్లె ప్రగతిలో జరిగిన పనులను ఇరువురు మంత్రులు కలిసి పరిశీలించారు. అనంతరం మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. రంగారెడ్డి జిల్లాకు వెయ్యికోట్లు వెచ్చించి పల్లె ప్రగతి పనులను చేయిస్తామని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని గ్రామాలకు అధిక నిధులను కేటాయిస్తున్నారని పేర్కొన్నారు. దళితుల అభ్యున్నతికి ప్రభుత్వం పనిచేస్తుందని.. అందరి అభివృద్ధే తమ కర్తవ్యమని పేర్కొన్నారు.

రాష్ట్రంలో పచ్చదనం.. పరిశుభ్రత పెంపొందించాల‌నే ల‌క్ష్యంతో నాలుగ‌వ విడ‌త పల్లెప్రగతి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. దీనిలో ముఖ్యంగా పారిశుధ్యం, మౌలిక స‌ధుపాయాలు, ఆరోగ్యం, హ‌రిత‌హారం, విద్యుత్తు తదితర సమస్యల ప‌రిష్కారం కోసం ప్రాధాన్యత ఇస్తున్నట్లు మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్‌రావు తెలిపారు. సిరిగిరిపురం గ్రామం పల్లె ప్రగతిలో ముందంజలో ఉన్నందున ఆ గ్రామానికి రూ.20 లక్షలను అబివృద్ధి పనుల కోసం మంజూరు చేశారు. అర్హులందరికి దశల వారీగా పింఛన్లు, రేషన్‌కార్డులను అందజేస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే మహేశ్వరం నియోజక వర్గం అన్ని రంగాలలో అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. పల్లె ప్రగతిలో ప్రజలందరు పాల్గొని జిల్లాను ఆదర్శంగా తీర్చిదిద్దాలన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని పలు విషయాలపై చర్చించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పన్‌ అనిత, మాజీ ఎమ్మెల్యే తీగల క్రిష్ణారెడ్డి, పంచాయతీరాజ్‌ కమిషనర్‌ రఘునందన్‌రావు, జిల్లా కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌, పంచాయతీ రాజ్‌ ట్రిబ్యునల్‌ మెంబర్‌ గోవర్ధన్‌రెడ్డి, ఎంపీపీ రఘుమారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Also Read:

Supreme Court: హైదరాబాద్‌లో ఆంక్షలు పిటిషన్‌ తోసిపుచ్చిన సుప్రీంకోర్టు.. ఈ-పాస్ సదుపాయం ఉందన్న ధర్మాసనం

Contact Marriage: డబ్బు కోసం నకిలీ పెళ్లిళ్లు.. విదేశాలకు వెళ్లి విడాకులు..అమ్మాయిల నయాదందా..ఎక్కడంటే