ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్ట్యూటీ (EMRI) 108లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా సిద్ధిపేట జిల్లా పరిధిలో ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఖాళీల భర్తీకి సంబంధించి జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ షేక్ సలీం, కోఆర్డినేటర్ కుమారస్వామి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా ఎమర్జెన్సీ మెడికల్ టెక్నిషియన్, ఫైలెట్ (డ్రైవర్), ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
ఈఎంటీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు బీఎస్సీ (బీజెడ్సీ), బీఎస్సీ (నర్సింగ్), జీఎన్ఎం, బీ ఫార్మసీ, డీ ఫార్మసీ, డీఎంఎల్ టీ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల వయసు 30 ఏళ్లు మించకూడదు. ఇక ఫైలెట్ ఉద్యోగానికి 10 తరగతి ఉత్తీర్ణతతో పాటుగా ఎల్ ఎం వీ (బ్యాడ్జ్ ) కలిగి ఉండాలి. వయసు 23 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. ఈఆర్ఓ పోస్టుకు ఇంటర్మీడియెట్ లేదా ఏదైనా డిగ్రి పాసై బేసిక్ కంప్యూటర్ పరిజ్జానం కలిగి ఉండాలని తెలిపారు.
ఈఆర్ఓ పోస్టులకు ఎంపికైన వారు హైదరాబాద్ లో ఉద్యోగం చేయాల్సి ఉండగా, మిగిలిన ఉద్యోగాలు సిద్దిపేట జిల్లా పరిధిలో పనిచేయాల్సి ఉంటుంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు, జిరాక్స్ సెట్ తో ఈనెల 13వ తేదీన సిద్ధిపేట బురుజు వద్ద గల ఓల్ట్ ఎంసీహెచ్ స్వచ్చబడి మీటింగ్ హాల్‌లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఇంటర్వ్యూ కు హాజరుకావాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం 7330967634 నెంబర్ కు సంప్రదించాలని తెలిపారు.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..