Bank Jobs: బ్యాంక్ జాబ్స్‌కి ప్రిపేర్ అవుతున్నారా.? ఈ ప్రభుత్వ బ్యాంకులో భారీగా ఉద్యోగాలు. ఇలా అప్లై చేసుకోండి.
ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. ముంబయి కేంద్రంగా పని చేసే ఈ బ్యాకు దేశవ్యాప్తంగా ఉన్న బ్రాంచుల్లో రెగ్యులర్ ప్రాతిపదికన ప్రొబేషనరీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...
ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. ముంబయి కేంద్రంగా పని చేసే ఈ బ్యాకు దేశవ్యాప్తంగా ఉన్న బ్రాంచుల్లో రెగ్యులర్ ప్రాతిపదికన ప్రొబేషనరీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ నేటి నుంచి (శనివారం) ఏయే విభాగంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 500 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో జనరల్ బ్యాంకింగ్ స్ట్రీమ్‌లో క్రెడిట్ ఆఫీసర్ (జీబీవో) (350), ఐటీ ఆఫీసర్ ఇన్ స్పెషలిస్ట్ స్ట్రీమ్(ఎస్‌పీఎల్) (150) ఖాళీలు ఉన్నాయి.
* క్రెడిట్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఏదైనా డిగ్రీ, ఐటీ ఆఫీసర్ ఖాళీలకు బీఈ, బీటెక్/ పీజీ(కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ అప్లికేషన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్) ఉత్తీర్ణులై ఉండాలి.
* అభ్యర్థుల వయసు 01-02-2023 నాటికి 20 నుంచి 29 ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను ఆన్‌లైన్ రాతపరీక్ష, గ్రూస్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఎంపికైన వారికి నెలకు రూ. 36,000 నుంచి రూ. 63,840 వరకు జీతంగా చెల్లిస్తారు.
* ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 11-02-2023న ప్రారంభమై 25-02-2023తో ముగియనుంది.
* నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..