CM Revanth: తెలంగాణ రాష్ట్ర గీతం రూపకల్పనపై.. ప్రముఖులతో సీఎం రేవంత్ సమావేశం..

CM Revanth: తెలంగాణ రాష్ట్ర గీతం రూపకల్పనపై.. ప్రముఖులతో సీఎం రేవంత్ సమావేశం..

Srikar T

|

Updated on: May 29, 2024 | 6:31 PM

తెలంగాణ రాష్ట్ర గీతం విషయంతో సీఎం రేవంత్ సర్కార్ కీలక అడుగులు వేస్తోంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర గీతం రూపకల్పన ప్రక్రియ తుది దశకు చేరుకుంది. తెలంగాణ రాష్ట్రం అవిర్భవించి దశాబ్దం పూర్తైన నేపథ్యంలో కొత్తగా ఒక గీతాన్ని రూపొందించాలని సంకల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం.ఈ గీతం రూపకల్పనపై కవి అందెశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణితో ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్కతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ సమీక్ష నిర్వహించారు.

తెలంగాణ రాష్ట్ర గీతం విషయంతో సీఎం రేవంత్ సర్కార్ కీలక అడుగులు వేస్తోంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర గీతం రూపకల్పన ప్రక్రియ తుది దశకు చేరుకుంది. తెలంగాణ రాష్ట్రం అవిర్భవించి దశాబ్దం పూర్తైన నేపథ్యంలో కొత్తగా ఒక గీతాన్ని రూపొందించాలని సంకల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం.ఈ గీతం రూపకల్పనపై కవి అందెశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణితో ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్కతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ సమీక్ష నిర్వహించారు. వీరితో పాటు ఈ సమావేశానికి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం, రఘు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, రాంచంద్రు నాయక్, గండ్ర సత్యనారాయణ, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే సంపత్, ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్, తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమం సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో జరిగింది. అయితే దీనిపై ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ విమర్శిస్తోంది. ఇప్పటికే తెలంగాణ వాహన రిజిస్ట్రేషన్ లో టీఎస్ గా ఉండే అక్షరాలను టీజీగా మార్పులు చేసింది. మరోవైపు ఆర్టీసీ లోగో, పేరును కూడా మరుస్తూ సంచలన నిర్ణయాలు తీసుకున్నారు సీఎం రేవంత్. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ధి దినోత్సవం సందర్భంగా ఈ రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరించనుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..