
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలకు సర్వం సిద్ధమవుతోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నామినేషన్ల దాఖలుకు మంగళవారంతో గడువు ముగియగా మొత్తం 321 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక గురువారం నామినేషన్ల పరీశీలన మొదలు పెట్టిన అధికారులు 211 మంది అభ్యర్థులు దాఖలు చేసిన 321 నామినేషన్లను ఎన్నికల అధికారులు స్క్రూటినీ చేశారు. స్క్రూటినీ అనంతరం 81 మంది నామినేషన్లకు మాత్రమే రిటర్నింగ్ అధికారి ఆమోదం తెలిపారు. వివిధ కారణాలతో 130 మంది అభ్యర్థులు వేసిన 186 నామినేషన్లను తిరస్కరించారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు, రీజినల్ రింగ్ రోడ్డు బాధిత రైతులు, ఓయూ, నిరుద్యోగ సంఘాల నాయకులు పెద్దసంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. అయితే సరైన ఫార్మాట్‌లో పత్రాలు సమర్పించకపోవడం, వివరాలు అసంపూర్తిగా ఉండటంతో వారిలో చాలామంది నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. నామినేషన్ల ఉపసంహరణకు గడవు ముగిసిన అనంతరం శుక్రవారం సాయంత్రం నాటికి బరిలో నిలిచిన అభ్యర్థులపై క్లారిటీ వస్తుంది.
మరోవైపు నామినేషన్ల స్క్రూటీని పారదర్శకంగా జరగలేదంటూ పలువురు ఇండిపెండెంట్ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. స్క్రూటీని విషయంలో అధికారులు వివక్ష చూపించారని తమకు జరిగిన అన్యాయంపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అయితే అధికారులు మాత్రం ఇండిపెండెంట్ అభ్యర్ధులపై ఎలాంటి వివక్ష చూపించలేదని..నిబంధనల ప్రకారమే స్క్రూటీని జరిగిందని చెబుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.