MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌.. అదుపులోకి తీసుకున్న ఈడీ

|

Mar 15, 2024 | 6:09 PM

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ కవితకు అరెస్ట్ నోటీసులు ఇచ్చారు ఈడీ అధికారులు. ఇవాళ హైదరాబాద్‌లో కవిత ఇంట్లికి చేరుకున్న ఈడీ అధికారులు, సెర్చ్ వారెంట్ తోపాటు అరెస్ట్ వారెంట్‌ను కవితకు అందించారు. కవిత ఇంట్లో గంటల తరబడి సోదాలు నిర్వహించారు. అనంతరం కవితను అదుపులోకి తీసుకున్నారు ఈడీ అధికారులు.

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌.. అదుపులోకి తీసుకున్న ఈడీ
Mlc Kavitha
Follow us on

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ కవితకు అరెస్ట్ నోటీసులు ఇచ్చారు ఈడీ అధికారులు. ఇవాళ హైదరాబాద్‌లో కవిత ఇంట్లికి చేరుకున్న ఈడీ అధికారులు, సెర్చ్ వారెంట్ తోపాటు అరెస్ట్ వారెంట్‌ను కవితకు అందించారు. కవిత ఇంట్లో గంటల తరబడి సోదాలు నిర్వహించారు. అనంతరం కవితను అదుపులోకి తీసుకున్నారు ఈడీ అధికారులు.

బంజారాహిల్స్‌లోని కవిత నివాసంలో ఈడీ అధికారులతో కలిసి ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఢిల్లీ నుంచి వచ్చిన 12 మంది అధికారుల బృందం 4 టీంలుగా ఏర్పడి తనిఖీలు చేసినట్లు సమాచారం. ఇద్దరు మహిళా అధికారులతో సహా 10 మంది అధికారులు సోదాల్లో పాల్గొన్నారు. కవితతో పాటు ఆమె భర్త వ్యాపారాలపైనా ఈడీ అధికారులు ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఇంట్లోకి ఎవరినీ అనుమతించడం లేదు. ఈ క్రమంలో కవిత రెండు ఫోన్లను అధికారులు సీజ్ చేశారు. ఆమె స్టేట్ మెంట్ ను రికార్డు చేసినట్లు సమాచారం.

ఢిల్లీ లిక్కర్‌ కేసులో ఏడాది గ్యాప్‌ తర్వాత ఎమ్మెల్సీ కవితకు ఫిబ్రవరి నెలలో సీబీఐ నోటీసులు ఇచ్చింది. 2022 డిసెంబర్‌లో కవిత నివాసంలోనే స్టేట్‌మెంట్ తీసుకున్న సీబీఐ.. గత ఫిబ్రవరి 26న ఢిల్లీకి రావాలని, తమ ఎదుట విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చింది. ఈ కేసులో కవితను నిందితురాలిగా చేర్చి 41-A కింద నోటీసులు ఇచ్చింది సీబీఐ. లిక్కర్ కేసులో కీలక నిందితులు అప్రూవర్లుగా మారడంతో.. వారి స్టేట్మెంట్స్ ఆధారంగా కవితకు నోటీసులు జారీ చేసింది సీబీఐ. ఇదే కేసులో ఇప్పటికే కవితను ఈడీ కూడా విచారించింది.

ఈడీ సోదాలపై కవిత లాయర్ సోమా భరత్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు ఎలాంటి చర్యలు ఉండవన్న ఈడీ.. సోదాలు చేయడం సరికాదన్నారు. కోర్టులో కేసు ఉండగా సడెన్‌గా ఎందుకీ సోదాలని ఆయన ప్రశ్నించారు. మరోవైపు బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున కవిత ఇంటికి చేరుకుంటున్నారు. ఈడీ దాడులకు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్‌ శ్రేణుల ధర్నాకు దిగారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

2022 జులైలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. దాదాపు 5 నెలల తర్వాత మొదటిసారిగా 2022 డిసెంబర్ 11న కవితను ఇంట్లోనే విచారించింది CBI. లిక్కర్ స్కామ్‌లో CRPC 160 కింద 7 గంటల పాటు ప్రశ్నించారు సీబీఐ అధికారులు. ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి సౌత్ గ్రూప్‌కు కవిత నేతృత్వం వహించారనేది ప్రధాన ఆరోపణ.

2022 మార్చి 11న మొదటిసారిగా ఈడీ విచారణకు హాజరైయ్యారు కవిత. ఆ తర్వాత 16, 20, 21 తేదీల్లో కూడా ఢిల్లీలో కవితను విచారించారు ఈడీ అధికారులు. ఆ సమయంలోనే తన 8 ఫోన్లను ఈడీ అధికారులకు అందజేశారు కవిత. ఆ తర్వాత ఛార్జ్‌షీట్‌లో కవిత పేరును ప్రస్తావించింది ఈడీ, సీబీఐ. ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ 50 కింద ఈడీ స్టేట్‌మెంట్ రికార్డ్ చేసింది. జనవరి 5న కవితకు మళ్లీ ఈడీ నోటీసులు ఇచ్చింది.

అయితే మహిళలను ఈడీ కార్యాలయానికి పిలిచి ప్రశ్నించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు కవిత. తనపై ఎలాంటి బలవంతపు చర్యలను ఈడీ తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో కవిత కోరారు. ఈ పిటిషన్‌ను ఇవాళ విచారించిన సుప్రీంకోర్టు ఈ నెల 19కి వాయిదా వేసింది.

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో గత నెల 21న కవితకు CBI సమన్లు జారీ చేసింది. గత నెల 26న వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో స్పష్టం చేసింది. ఈ కేసులో కవితను నిందితురాలిగా చేర్చి 41-A కింద నోటీసులు ఇచ్చింది సీబీఐ. సుప్రీం కోర్టులో కేసు విచారణ ఉండగా.. తాను విచారణకు రాలేనని సీబీఐకి లేఖ రాశారు కవిత.

ఇప్పటివరకు ఈ కేసులో దినేష్ ఆరోరా, గోరుంట్ల బుచ్చిబాబు, అరుణ్ రామచంద్ర పిళ్ళై, మాగుంట రాఘవ అప్రూవర్లుగా మారారు. ఇదే కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను అరెస్ట్ ఈడీ చేసింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..