తాండూరు చైర్‌పర్సన్‌ దొంగ ఓటు వ్యవహారంపై ఈసీ సీరియస్‌.. నేరం రుజువయితే శిక్ష ఏంటంటే..?

|

Mar 20, 2021 | 8:10 AM

ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాండూరు మున్సిపల్‌ ఛైర్‌ పర్సన్‌ తాటికొండ స్వప్న.. ఓటు హక్కు వినియోగించుకోవడం వివాదాస్పదమైంది.

తాండూరు చైర్‌పర్సన్‌ దొంగ ఓటు వ్యవహారంపై ఈసీ సీరియస్‌.. నేరం రుజువయితే శిక్ష ఏంటంటే..?
Tandur Fake Vote
Follow us on

ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాండూరు మున్సిపల్‌ ఛైర్‌ పర్సన్‌ తాటికొండ స్వప్న.. ఓటు హక్కు వినియోగించుకోవడం వివాదాస్పదమైంది. స్వప్న వేరొకరి ఓటును వేసినట్టుగా నిర్ధారణ కావడం ఇప్పుడు సంచలనంగా మారింది. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న స్వప్న అడ్డదారిలో ఓటు వేయడం రాజకీయంగా దుమారం రేపింది. దొంగ ఓటు వేసినట్టు బయట పడడంతో.. చైర్‌పర్సన్‌ పదవికి రాజీనామా చెయ్యాలని డిమాండ్‌ చేస్తూ.. కాంగ్రెస్‌, సీపీఐ, తెలంగాణ జన సమితి కౌన్సిలర్లు మున్సిపల్‌ ఆఫీస్‌ ముందు ధర్నాకు దిగారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్వప్న పేరిట ఓటు లేకున్నా.. ఆమె తోటి కోడలు పై నమోదైన ఓటును వేశారు. దీనిపై జిల్లా కలెక్టర్ నుంచి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వరకూ విపక్షాలు ఫిర్యాదు చేశాయి. ఈ ఘటనపై స్పందించిన ఎన్నికల కమిషన్… జిల్లా కలెక్టర్‌ను విచారణకు ఆదేశించారు.

ఆయన విచారణలో చైర్ పర్సన్ వేసింది దొంగ ఓటేనని తేలింది. దీంతో దొంగ ఓటు ఈ విషయంలో ఒక తాటి పైకి వచ్చిన ప్రతిపక్షాలు ఆమె తీరును తప్పుపడుతున్నాయి. అటు ఈ కేసు విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం కూడా సీరియస్ అయింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం పోలీసులు సుమోటగా కేసు నమోదు చేసే అవకాశం ఉంది. ఐపీసీ సెకన్ 171ఎఫ్, 171డి కింద కేసులు పెట్టవచ్చని తెలుస్తోంది. అయితే తనపై వస్తున్న ఆరోపణల మీద ఛైర్‌పర్సన్‌ స్వప్న.. స్పందించారు. విచారణలో ఉన్నతాధికారులకు అన్ని చెబుతానన్నారు. అటు.. ఆమె భర్త మాత్రం.. తన భార్య తప్పేంలేదని, ఆమెను రాజకీయాల్లోకి తీసుకువచ్చి తానే తప్పుచేశానని అంటున్నాడు. కాగా నేరారోపణ నిజం అయితే స్వప్నను డిస్మిస్‌ చేసేందుకు  విచక్షణాధికారం కలెక్టర్‌కు ఉందని అధికారులు చెబుతున్నారు. అంతేకాదు దొంగ ఓటు వేసినట్టు రుజువయితే రెండేళ్లు జైలుశిక్ష కూడా పడే అవకాశం ఉంది.

ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ లైవ్ అప్‌డేట్స్ దిగువన చూడండి

Also Read:  Tsunami: 2004 సునామీలో కోట్టుకుపోయిన పోలీసు.. 16 ఏళ్ల తరువాత ప్రత్యక్ష్యమయ్యాడు.. ఇప్పుడెలా ఉన్నాడో మీరే చూడండి..

Schools in Block List: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సంచలన ప్రకటన.. 259 ప్రైవేటు పాఠశాలల గుర్తింపు రద్దు..