డిజిటల్ యుగం.. మనం సృష్టించుకున్న కొన్ని వస్తువులే మనకు ముప్పుగా..!

దేశంలో పెరుగుతున్న ఎలక్ట్రానిక్ వ్యర్థాల వల్ల పర్యావరణం, ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ-వ్యర్థాలలోని విషపూరిత పదార్థాలు వాతావరణ కాలుష్యానికి, అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతున్నాయి. సమర్థవంతమైన రీసైక్లింగ్, వ్యర్థాల నిర్వహణ వ్యవస్థ అవసరం, ఇది పర్యావరణాన్ని కాపాడటానికి ప్రజల ఆరోగ్యాన్ని రక్షించటానికి కీలకం.

డిజిటల్ యుగం.. మనం సృష్టించుకున్న కొన్ని వస్తువులే మనకు ముప్పుగా..!
E Waste

Edited By: SN Pasha

Updated on: May 05, 2025 | 9:20 PM

దేశంలో సాంకేతిక విప్లవం వెల్లువెత్తుతూ, ఆధునిక పరికరాల వినియోగం అంతకంతకూ పెరుగుతోంది. ఎలక్ట్రానిక్‌ యుగంలో పలు నూతన ఆవిష్కరణలు జరుగుతూనే ఉన్నాయి. ఎలక్ట్రానిక్‌ పరికరాల వాడకం పెరగడం వల్ల వాటి వ్యర్థాలూ టన్నుల కొద్దీ భూమిలో పేరుకుపోయి.. మనకే ముప్పు తెచ్చిపెడుతున్నాయి.. వీటి నుంచి వచ్చే ఉద్గారాలు పర్యా వరణాన్ని ఊహించని స్థాయిలో కలుషితం చేయడమే కాకుండా, ఆరోగ్య సమస్యలపైనా తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏటా హెచ్ఎండీఏ పరిధిలో సుమారు 60 వేల మెట్రిక్ టన్నుల ఈ- వ్యర్థాలు ఉత్పన్నమవడం ఆందోళన కలిగిస్తుంది.

కాలానికి అనుగుణంగా కంప్యూటర్‌, లాప్‌ టాప్‌, ప్రింటర్‌, ఫాక్స్‌, సెల్‌ఫోన్‌, లాండ్‌ ఫోన్‌, ఛార్జర్‌, మైక్రోవేవ్‌, ఎలక్ట్రికల్‌ కుక్కర్‌, టీవి, డివిడి, రిమోట్‌, స్టీరియో టేప్‌ రికార్డర్‌, ఎసిలు, వాషింగ్‌ మిషన్లు, ఫాన్‌, పాత మోటార్లు, కరెంట్‌ వైర్లు, వాటర్‌ హీటర్‌ వంటి ఎలక్ట్రానిక్‌ వస్తువుల వినియోగం నానాటికి పెరుగుతుంది..ప్రతి ఒక్కరూ ఎలక్ట్రానిక్‌ వస్తువులను వినియోగించనిదే ఒక్క క్షణం కూడా గడవని పరిస్థితి ఉంది..ఇదిలా ఉంటే ఒక వేళ ఇవి పాడయిపోతే పారవేయడం తప్ప- తిరిగి ఉపయోగించేలా చేసే కేంద్రాలు తక్కువే..కొన్ని నగరాల్లో అలాంటి వెసులుబాట్లు ఉన్నా అంతగా వినియోగంలేదు..తగినన్ని రీ-సైక్లింగ్‌ కేంద్రాలు లేక ఈ-వ్యర్థాల్లోని పదార్థాలు వాతావరణంలో కలిసిపోయి పర్యావరణ సమస్యలకు కారణమవుతున్నాయి..

ఎలెక్ట్రానిక్‌ వ్యర్థాల సేకరణ, వినియోగం వంటి చర్యలు దేశంలో నామమాత్రంగానే కొనసాగుతున్నాయి..అయితే వ్యర్థాలను మరమ్మతు చేయడం, పునర్వి నియోగానికి ఆమోదయోగ్యంగా మార్చడానికి అవకాశం ఉంది.. అయితే ఆచరణలో కొంత మేరకు ఇది దారి తప్పుతోంది..కోటి, అమీర్ పేట్, ఐటీసీ సికింద్రాబాద్, ఫైనాన్షియల్ జిల్లా, ఐటీ హబ్ తది తర ప్రాంతాల్లో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలపై ఎలాంటి సమాచారం ఉండటంలేదు..అయితే హెచ్ఎండీఏ పరిధిలో 2017తో పోల్చుకుంటే22 వరకు పది టన్నులకు పైగా పెరిగిందంటే అర్ధం చేసుకోవచ్చు..వీని వినియోగం ఎంతలా పెరిగిపోయిందో..మరోపక్క వీటి వల్ల తీవ్ర అనారోగ్యని గురవుతున్నారు..

ఈ-వ్యర్థాలు సీసం, పాదరసం, కాడ్మియం వంటి విషపూరిత పదార్థాలను విడుదల చేస్తాయి..అవి వెయ్యి కంటే ఎక్కువ యూనిట్లు ఎలక్ట్రికల్, ఎలక్ట్రా భూమిలోకి హానికరమైన రసాయనాలను విడుదల చేస్తాయి..ఫలితంగా హెవీమెటల్ ఎక్స్పోజర్ ఏ..గర్భిణుల్లో హార్మోన్లు, పిండాలపై ప్రభావం చూపడంతో పిల్లల్లో మెదడు అభివృద్ది తగ్గుతుంది..అయితే ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే..ఈ వ్య ర్థాల నిర్వహణపై జాగ్రత్తగా వ్యవహరించాలి..శాస్త్రీయ పద్దతుల్లో రీసైక్లింగ్ చేయడం ద్వారా పర్యావరణాన్ని, ఆరోగ్యాన్ని సంరక్షిం చుకోవచ్చు..చట్టవిరుద్ధంగా ఈ వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో, పురపాలక చెత్త డబ్బాల్లో కలపరాదు..కొన్ని రకాల ఈ-వ్య ర్థాలు భారీ లోహాలు కలిగి ఉంటాయి.. నీళ్లు, మట్టి, చెత్తలో కలపడం వల్ల ప్రమాదకరమైన కెమికల్స్ ను విడుదల చేస్తాయి..ఇది చాలా ప్రమాదకరం..అందుకే ఇలాంటి వస్తువులపై అవగాహనాలు కల్పించి పర్యవరణ సంరక్షణతో పాటు మనషులు ఆరోగ్యానికి కూడా కాపాడుకోవాలంటూ నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి