Telangana: 10 కోట్ల విలువైన గంజాయిని బ్రాయిలర్‌లో వేసి కాల్చేసిన పోలీసులు.. వీడియో చూడండి..
రాష్ట్రవ్యాప్తంగా పలు కేసుల్లో పట్టుకున్న గంజాయిని దగ్ధం చేశారు పోలీసులు. 2024 నుంచి ఇప్పటి వరకు 2010.135 కేజీ లు గంజా స్వాధీనం చేసుకున్నామని.. వీటి విలువ రూ. 10 కోట్ల 5 లక్షల 6 వేల 750 ఉంటుందని వెల్లడించారు. మొత్తం 74 కేసుల్లో గంజాయిని పట్టుకున్నామని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా వివిధ రైల్వే స్టేషన్లలో పట్టుకున్న గంజాయిని GRP సికింద్రాబాద్ పోలీసులు దహనం చేశారు. 2024 -2025 సంవత్సరంలో NDPS యాక్ట్ కింద 74 కేసులలో పట్టుకున్న పది కోట్ల రూపాయల విలువ చేసే రెండు టన్నుల పది కేజీల గంజాయిని కాల్చి వేసినట్లు డ్రగ్స్ డిస్పోజల్ కమిటీ చైర్మన్, రైల్వే ఎస్సీ చందన దీప్తి తెలిపారు. కొందరు స్మగ్లర్లు రోడ్డు మార్గంలో కాకుండా రైలు మార్గంలో గంజాయిని తరలిస్తున్నారు. ఈ క్రమంలో సికింద్రాబాద్, హైదరాబాద్, కాజీపేట వెళ్లే రైళ్ల ద్వారా వివిధ ప్రాంతాల నుంచి గంజాయి రవాణా జరుగుతోంది. దీనిపై సమాచారం ఉండటంతో రైల్వే పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ గంజాయి సీజ్ చేస్తున్నారు. తాజాగా కోర్టు ఆదేశాల మేరకు ఏడాది కాలంలో పట్టుకున్న గంజాయిని యాదాద్రి జిల్లా భువనగిరి మండలం తుక్కాపురంలోని రోమా కంపెనీకి తరలించారు. అక్కడ కంపెనీకి చెందిన బ్రాయిలర్‌లో గంజాయిని కాల్చివేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

