Telangana: తెలంగాణ వైద్య విద్యలో సరికొత్త రికార్డు.. 8.78 లక్షల నీట్‌ ర్యాంకుకూ ఎంబీబీఎస్‌ సీటు!

|

Dec 27, 2022 | 12:50 PM

తెలంగాణ ప్రభుత్వం నిర్ణయాలతో వైద్య విద్యలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. రాష్ట్ర వైద్య విద్య చరిత్రలోనే సరికొత్త రికార్డు నమోదైంది. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా మెడికల్‌ కాలేజీల ఏర్పాటుతో భారీగా మెడికల్ సీట్ల సంఖ్య పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 8 మెడికల్‌..

Telangana: తెలంగాణ వైద్య విద్యలో సరికొత్త రికార్డు.. 8.78 లక్షల నీట్‌ ర్యాంకుకూ ఎంబీబీఎస్‌ సీటు!
Telangana Medical Seats
Follow us on

తెలంగాణ ప్రభుత్వం నిర్ణయాలతో వైద్య విద్యలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. రాష్ట్ర వైద్య విద్య చరిత్రలోనే సరికొత్త రికార్డు నమోదైంది. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా మెడికల్‌ కాలేజీల ఏర్పాటుతో భారీగా మెడికల్ సీట్ల సంఖ్య పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 8 మెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేయడంతో అదనంగా 150 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో వైద్య విద్య ఎక్కువ మందికి చేరువైంది. ఏకంగా 8.78 లక్షల నీట్‌ ర్యాంకుకూ ఎంబీబీఎస్‌ సీటు రావడం విశేషం.

అంతేకాకుండా బి- కేటగిరీలో 85శాతం లోకల్‌ రిజర్వేషన్‌ కల్పనతో భారీగా సీట్లు లభించాయి. దీంత పాటు ఎస్టీ రిజర్వేషన్‌ను 6 నుంచి 10 శాతానికి పెంచారు. మెడికల్‌ కాలేజీల ఏర్పాటుతో రాష్ట్రంలో ఎంబీబీఎస్‌ సీట్లకు మార్కుల కటాఫ్‌ భారీగా తగ్గింది. దీంతో రాష్ట్ర విద్యార్థులకు పెరిగిన వైద్య విద్య అవకాశాలు భారీగా పెరిగాయి. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో డాక్టర్‌ కావాలనుకునే వారు కల సాకారమవుతోంది.

మెడికల్‌ సీట్ల కల్పనలో తెలంగాణ దేశంలోనే అగ్ర స్థానానికి చేరుకుంది. జనాభా ప్రాతిపదికన ఎంబీబీఎస్‌ సీట్లలో తెలంగాణ మొదటి స్థానంలో నిలవడం విశేషం. ఇక పీజీ సీట్ల విషయానికొస్తే దేశంలో రెండో స్థానంలో నిలిచింది. ‘రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీల ఏర్పాటు, ప్రభుత్వ ఆసుపత్రుల నిర్మాణంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ గారి పాలనలో ఆరోగ్య తెలంగాణ లక్ష్యం నెరవేరుతోంది’అని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..