కేంద్రం సవరించిన కొత్త మోటార్ వెహికిల్ చట్టం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా అమలుపరచని విషయం తెలిసిందే.. అయినా కూడా ఓ వాహనదారుడికి ఈ చట్టం ప్రకారం ఫైన్ పడింది. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడ్డ ఓ వ్యక్తికి రూ.10000/- పెనాల్టీ పడింది. సాధారణంగా డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ వారికి రూ.2000/- ఉండేది. అయితే 10000/- విధించడంతో కేంద్రం తెచ్చిన కొత్త చట్టం ప్రకారం ఫైన్ పడ్డట్లైంది. నల్గొండ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. మద్యం తాగి వాహనాన్ని నడుపుతున్న నకిరేకల్‌కి చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అతన్ని మంగళవారం మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు. అయితే తొలి నేరంగా భావించిన న్యాయమూర్తి రూ.10000/- జరిమానా విధించారు. అయితే జరిమానా చెల్లించకపోతే.. 15 రోజుల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుందని పేర్కొన్నారు.