డ్రగ్స్ కేసు: సిట్ నివేదికను ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో సిట్ దర్యాప్తుపై నివేదిక ఇవ్వాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశించింది.
Telangana Drugs Case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో సిట్ దర్యాప్తుపై నివేదిక ఇవ్వాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశించింది. డ్రగ్స్ కేసుపై 2017లో దాఖలైన ఓ పిల్‌పై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఈ కేసులో అంతర్జాతీయ ముఠాల ప్రమేయం ఉన్నందున ఎక్సైజ్ సిట్ పరిధి సరిపోదని పిటిషనర్, ఆ పిల్‌లో పేర్కొన్నారు. ఈ కేసును సీబీఐ, ఈడీ, నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో వంటి కేంద్ర సంస్థలకు అప్పగించాలని ఆ పిటిషనర్ కోరారు. (మన చుట్టూ ఎంత కఠినాత్ములు ఉంటారంటే: తమన్నా భావోద్వేగం)
ఇక మరోవైపు ఈ కేసులో దర్యాప్తునకు ఈడీ, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో సిద్ధంగా ఉన్నాయని న్యాయవాది రచనా రెడ్డి తెలిపారు. కానీ ఈడీ, ఎన్సీబీకి రాష్ట్ర ప్రభుత్వం వివరాలు ఇవ్వడం లేదని రచనా రెడ్డి అన్నారు. ఈ నేపథ్యంలో డ్రగ్స్ కేసులో సిట్ దర్యాప్తు ఏ స్థితిలో ఉందో డిసెంబరు 10 లోగా తెలపాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. (హెర్బల్ ఆయిల్ పేరుతో కుచ్చుటోపి.. రూ.52లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు)