Telangana: హైదరాబాద్ వాసులకు అలెర్ట్.! ఈ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా కట్.. ఎందుకంటే.?

హైదరాబాద్ ప్రజలారా..! బీ అలెర్ట్.. ఇవాళ పలు ప్రాంతాల్లో మంచినీటి సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కోదండాపూర్‌ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌లో విద్యుత్ అంతరాయం కారణంగా, కృష్ణా ఫేజ్–II 2375 మిమీ గల పంపింగ్ మెయిన్ పైప్‌లైన్‌‌కు భారీ లీకేజీ ఏర్పడింది. జలమండలి అధికారులు అత్యవసరంగా మరమ్మతు పనులు చేపడుతున్నారు.

Telangana: హైదరాబాద్ వాసులకు అలెర్ట్.! ఈ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా కట్.. ఎందుకంటే.?
Hyderabad Water Supply

Updated on: Nov 13, 2025 | 1:49 PM

హైదరాబాద్ ప్రజలారా..! బీ అలెర్ట్.. ఇవాళ పలు ప్రాంతాల్లో మంచినీటి సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కోదండాపూర్‌ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌లో విద్యుత్ అంతరాయం కారణంగా, కృష్ణా ఫేజ్–II 2375 మిమీ గల పంపింగ్ మెయిన్ పైప్‌లైన్‌‌కు భారీ లీకేజీ ఏర్పడింది. జలమండలి అధికారులు అత్యవసరంగా మరమ్మత్తు పనులు చేపడుతున్నారు. దీనివల్ల కృష్ణా ఫేజ్–II నుంచి హైదరాబాద్‌కు నీటి సరఫరాపై ప్రభావం ఏర్పడుతుంది.

అంతరాయాలు ఏర్పడే ప్రాంతాలు:

డివిజన్ 11, 19: పరిధిలోని వనస్థలిపురం, ఆటోనగర్

డివిజన్ 10: వైశాలీనగర్, నాగోల్

డివిజన్ 18, 20: బడంగ్‌పేట్, లెనిన్ నగర్, ఏ.ఆర్.సి.ఐ.

బాలాపూర్ రిజర్వాయర్, బర్కాస్, మైసారం(డివిజన్ 8)

ఎల్లుగుట్ట రిజర్వాయర్ (డివిజన్ 14)

డివిజన్ 7 — తార్నాక, బౌద్ధనగర్, లాలాపేట్, మారేడ్ పల్లి, ప్రకాశ్‌నగర్, పాటిగడ్డ, మేకలమండి, మహేంద్ర హిల్స్ రిజర్వాయర్లు

డివిజన్ 5 — మేకలమండి రిజర్వాయర్

ట్రాన్స్మిషన్ డివిజన్ 3 — ఎం.ఈ.ఎస్. రైల్వేలు, కంటోన్మెంట్ ప్రాంతాలు

డివిజన్ 9 — హష్మత్ పేట్, బాలానగర్

నీటి సరఫరాలో అంతరాయం కలగనున్న ప్రాంతాల్లోని వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.