TSRTC: తెలంగాణ మహిళలకు గుడ్ న్యూస్.. ఆ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం

|

Jan 27, 2024 | 2:43 PM

ఫిబ్రవరి 18 నుంచి 25 వరకు జరిగే మేడారం జాతరకు ప్రత్యేకంగా 6000 బస్సులను నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఒక్క హైదరాబాద్ నుంచే 2 వేల బస్సులు నడుపుతున్నారు. అయితే ఈ ప్రత్యేక బస్సుల్లో మహిళల నుంచి ఛార్జీలు వసూలు చేయాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రతిపాదించారు. కానీ...

TSRTC: తెలంగాణ మహిళలకు గుడ్ న్యూస్.. ఆ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం
Telangana Women
Follow us on

తెలంగాణ, జనవరి 27: మేడారం జాతర సందర్భంగా ప్రత్యేక బస్సుల్లో మహిళల నుంచి కూడా ఛార్జీలు వసూలు చేయాలన్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రతిపాదనను డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తిరస్కరించారు. రాష్ట్ర బడ్జెట్‌కు సంబంధించి భట్టి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఉన్నతాధికారులు ఇటీవల సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ.. వచ్చే మేడారం జాతర సందర్భంగా తిరిగే ప్రత్యేక బస్సుల్లో మహిళల నుంచి టిక్కెట్లు తీసుకుంటే సంస్థ ఆదాయం పెరుగుతుందని ప్రతిపాదించారు. దీనిపై భట్టి స్పందిస్తూ.. ఇది సరికాదని, మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగించాలని స్పష్టం చేశారు. మేడారం మాత్రమే కాకుండా ఏ జాతర సమయంలోనూ మహిళల నుంచి ఛార్జీలు తీసుకోవద్దని ఆదేశించారు. ఫిబ్రవరి 18 నుంచి 25 వరకు జరిగే మేడారం జాతరకు ప్రత్యేకంగా 6000 బస్సులను నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఒక్క హైదరాబాద్ నుంచే 2 వేల బస్సులు నడుపుతున్నారు.

జాతరకు భారీగా ఏర్పాట్లు…

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరకు కౌంట్‌డౌన్ షురూ అయింది. కోట్లాదిమంది భక్తుల నమ్మకానికి ప్రతిరూపం… మేడారం సమ్మక్క సారక్క జాతర ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టింది కొత్త ప్రభుత్వం. స్థానిక ఆదివాసీ బిడ్డ సీతక్క మంత్రి కావడం, అదే జిల్లాకు చెందిన కొండా సురేఖ దేవాదాయ మంత్రిగా చార్జ్ తీసుకోవడం… ఈ రెండు స్పెషాలిటీల ప్రభావం ఈసారి మహా జాతరపై స్పష్టంగా కనిపించబోతోంది. వందకోట్లకు పైగా ఖర్చయ్యే జాతర కోసం ప్రభుత్వం ఇప్పటికే 70 కోట్లు మంజూరు చేసింది.

ఈసారి జాతరకు ఐదు రాష్ట్రాల నుంచి కోటీ 50 లక్షల మంది భక్తులు వస్తారన్నది అంచనా. వీఐపీలు, ప్రజాప్రతినిధులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండాలంటే జాతర నిర్వహణలో పోలీసులదే కీలక పాత్ర. పైగా.. .మావోయిస్టు యాక్షన్ టీమ్‌తో ముప్పు ఉన్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం అయ్యాయి.

మేడారం జాతరకు వెళ్తే భక్తులకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు శుభవార్త చెప్పింది తెలంగాణ ఆర్టీసీ. మహిళలకు ఉచిత ప్రయాణం కనుక భక్తుల రద్దీ పెరిగితే అదనపు సర్వీసులు కూడా సిద్ధం చేశారు. సో… కోట్లాదిమంది భక్తుల నమ్మకానికి ప్రతిరూపం, కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారం… మేడారం జాతర.. తెలంగాణ కుంభమేలా… మరికొద్ది రోజుల్లో సాక్షాత్కారం.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..