Sircilla: చిల్లర లేదా పర్లేదు సారూ.. స్కానర్ ఉంది..

కాలానికి తగ్గట్టే బిక్షాటన కూడా డిజిటల్ అవుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ బిక్షగాడు చేతిలో పాత్ర కాకుండా క్యూఆర్ కోడ్ పట్టుకుని ‘స్కాన్ చేసి డబ్బులు పంపండి’ అంటూ భిక్ష అడుగుతూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. చిల్లర లేకపోయినా మొబైల్‌తో చెల్లింపులు చేసే ఈ కొత్త ట్రెండ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Sircilla: చిల్లర లేదా పర్లేదు సారూ.. స్కానర్ ఉంది..
Digital Beggar

Edited By:

Updated on: Apr 12, 2026 | 11:50 AM

కాలం మారింది… టెక్నాలజీ వేగంగా దూసుకుపోతోంది… ఇదే క్రమంలో బిక్షాటన కూడా ఇంత అప్‌డేట్ అవుతుందని ఎవరన్న ఊహించారా… ఇదిగో రాజన్న సిరిసిల్ల జిల్లాలో  డిజిటల్ బిక్షగాడు కొత్త ట్రెండ్ మొదలెట్టేశాడు. సిరిసిల్ల పట్టణంలోని గాంధీ చౌక్ సమీపంలో ఓ బిక్షగాడు తన స్టైల్‌తో అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. చేతిలో బిక్ష పాత్ర కాదు… క్యూఆర్ కోడ్ ఉంది.  అమ్మా… అయ్యా… చిల్లర లేదంటే పరవాలేదు… స్కాన్ చేసి పైసలు పంపండి.. అంటూ మోడ్రన్‌గా బిక్ష అడుగుతున్నాడు.

రోడ్డుపై వెళ్లే వాళ్లు ఒక్కసారి ఆగి అతనివైపు ఆశ్చర్యంగా చూస్తున్నారు… నవ్వుకుంటున్నారు… కొందరు నిజంగానే స్కాన్ చేసి డబ్బులు పంపిస్తున్నారు కూడా.. చిల్లర కోసం జేబుల్లో వెతికే కాలం పోయింది… ఇప్పుడు మొబైల్ తీసి స్కాన్ అండ్ పేమెంట్ చేసేస్తున్నారు. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… కొందరు యువకులు ఇదే రియల్ డిజిటల్ ఇండియా.. అంటూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. మొత్తానికి పేదరికం ఒక వైపు బాధగా ఉన్నా… ఈ బిక్షగాడి ఐడియా మాత్రం నవ్వులు పూయిస్తోంది. చిల్లర లేదు.. అనే ఎక్స్‌క్యూజ్‌కి ఇప్పుడు చెక్ పడింది..

Follow Us