డెంగ్యూ నివారణకు ప్రజల భాగస్వామ్యం అవసరం : మంత్రి కేటీఆర్

| Edited By:

Sep 09, 2019 | 6:31 PM

హైదరాబాద్‌లో డెంగ్యూ జ్వరాలు వ్యాపించడంపై మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు అన్నిరకాల సేవలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. డెంగ్యూ వ్యాపించడానికి ప్రధానంగా  ఇళ్లలో నిల్వ ఉండే నీరే కారణమని, మురికి కాలువలు, సీవరేజ్  కారణం కాదన్నారు. జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది ఉన్నప్పటికీ నగర వాసులు ఈ సమస్యపై ఎవరికి వారు  స్పందిస్తే తప్ప పరిష్కారం కాదన్నారు. మున్సిపల్ శాఖ విభాగాధిపతులతో మంత్రి కేటీఆర్ సమావేశమై పలు విషయాలపై […]

డెంగ్యూ నివారణకు  ప్రజల భాగస్వామ్యం అవసరం : మంత్రి కేటీఆర్
Follow us on

హైదరాబాద్‌లో డెంగ్యూ జ్వరాలు వ్యాపించడంపై మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు అన్నిరకాల సేవలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. డెంగ్యూ వ్యాపించడానికి ప్రధానంగా  ఇళ్లలో నిల్వ ఉండే నీరే కారణమని, మురికి కాలువలు, సీవరేజ్  కారణం కాదన్నారు. జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది ఉన్నప్పటికీ నగర వాసులు ఈ సమస్యపై ఎవరికి వారు  స్పందిస్తే తప్ప పరిష్కారం కాదన్నారు.

మున్సిపల్ శాఖ విభాగాధిపతులతో మంత్రి కేటీఆర్ సమావేశమై పలు విషయాలపై చర్చించారు. నగరంలో పెరుగుతున్న డెంగ్యూ జ్వరాలపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ మంత్రి వర్గం నిర్ణయంతో బస్తీ దవాఖానాల సంఖ్య పెంచుతామని, ఈ దవాఖానాల్లో సాయంత్రం సమయాల్లో కూడా ఓపీ సేవలు అందుబాటు ఉంటాయని, జీహెచ్‌ఎంసీ పరిధిలో సీజనల్ వ్యాధులపై 12 నెలలపాటు అనుసరించాల్సిన క్యాలెండర్ రూపొందించినట్టు ఆయన తెలిపారు. దీనిద్వారా అధికారులు, సిబ్బంది, ప్రజలు ఎవరు ఏం చేయాలో నిర్దేశించినట్టు చెప్పారు కేటీఆర్.

రేపటి నుంచి రోజుకు మూడు అవగాహన సమావేశాలు నిర్వహించనున్నట్టు చెప్పారు కేటీఆర్. ఈ సమావేశాల ద్వారా అంటువ్యాధులు, సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలన్నారు. పారిశుద్యం, దోమల నివారణపై ఇప్పటికే అన్ని విభాగాల అధిపతులతో చర్చించామని, ఎలాంటి భయాందోళనకు గురికావద్దన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీటి నిల్వ లేకుండా చూసుకోవాలని ప్రజలకు విఙ్ఞప్తి చేశారు మంత్రి కేటీఆర్.