Delta Variant AY 4.2: తెలంగాణలోనూ ఏవై 4.2 కరోనా వేరియంట్.. దేశంలో ఎక్కువ కేసులు ఆ రాష్ట్రాల్లోనే..

|

Oct 28, 2021 | 1:45 PM

Delta variant AY.4.2: ప్రస్తుతం దేశంలో కరోనా డెల్టా ఏవై.4.2 వేరియంట్ కలకలం రేపుతోంది. కర్ణాటకలో తాజాగా ఏవై.4.2 వేరియంట్ కేసులు ఏడు నమోదయ్యాయి. దీంతో కేంద్ర ప్రభుత్వంతోపాటు

Delta Variant AY 4.2: తెలంగాణలోనూ ఏవై 4.2 కరోనా వేరియంట్.. దేశంలో ఎక్కువ కేసులు ఆ రాష్ట్రాల్లోనే..
Coronavirus
Follow us on

Coronavirus Delta variant AY.4.2: ప్రస్తుతం దేశంలో కరోనా డెల్టా ఏవై.4.2 వేరియంట్ కలకలం రేపుతోంది. కర్ణాటకలో తాజాగా ఏవై.4.2 వేరియంట్ కేసులు ఏడు నమోదయ్యాయి. దీంతో కేంద్ర ప్రభుత్వంతోపాటు, పలు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా అప్రమత్తమయ్యాయి. బెంగళూరులో మూడు కేసులు.. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో నాలుగు కేసులు నమోదయ్యాయని కర్ణాటక రాష్ట్ర ఆరోగ్య శాఖ కమిషనర్ డి రణదీప్ ప్రకటించారు. ఈ క్రమంలో తెలంగాణలో కూడా కరోనా డెల్టా ఏవై.4.2 వేరియంట్ అలజడి సృష్టిస్తోంది. రాష్ట్రంలో రెండు డెల్టా ఏవై కేసులు నమోదయ్యాయంటూ ప్రచారం జరిగింది. దీనిపై తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ క్లారిటీ ఇచ్చింది. తెలంగాణలో కూడా ఒక ఏవై 4.2 కరోనా వేరియంట్ కేసు నమోదైనట్లు తెలిపింది. అయితే.. ఈ కేసు 2021 జూన్ నెలలో నమోదైందని వెల్లడించింది. జూన్ నుంచి ఇప్పటి వరకు ఏవై 4.2 కేసులు నమోదు కాలేదంటూ స్పష్టంచేసింది.

JD-NCDC నివేదిక ప్రకారం. భారతదేశంలో ఇప్పటివరకు 18 ఏవై 4.2 వేరియంట్ కేసులు నమోదయ్యాయి. వీటిలో ఎక్కువగా కర్ణాటక, మహారాష్ట్రలోనే నమోదైనట్లు వెల్లడించింది. తెలంగాణలో జూన్ నెలలో ఒక AY 4.2 కేసు మాత్రమే నమోదైందని.. ఇప్పటివరకు ఎలాంటి కేసులు నమోదు కాలేదని నేషనల్ సెంటర్ ఫర్ డిసిజ్ కంట్రోల్ వెల్లడించింది.

మొదట యూకే, రష్యా, అమెరికా, ఇజ్రాయిల్ వంటి దేశాల్లో విస్తరించిన డెల్టా ఏవై.4.2 వేరియంట్ సాధారణ డెల్టా వెరియెంట్‌తో పోలిస్తే 15 శాతం వేగంగా వ్యాప్తి చెందుతుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

Also Read: