ముగిసిన ప్రైవేటు కాలేజీల డెడ్‌లైన్‌.. సోమవారం నుంచి ప్రైవేట్‌ కాలేజీల నిరవధిక బంద్‌!

ఫీజు రీ-ఇంబర్స్‌మెంట్‌ బకాయిలపై ప్రభుత్వానికి ప్రైవేట్ కాలేజీలు ఇచ్చిన డెడ్‌లైన్‌ ముగిసింది...! మరోవైపు ప్రైవేట్ కాలేజీలపై విజిలెన్స్‌ తనిఖీలకు తెలంగాణ సర్కార్ ఆదేశించింది. బకాయిలు అడిగితే విజిలెన్స్‌ ఇన్‌స్పెక్షన్లతో కౌంటర్‌ అటాక్‌ చేస్తారా అంటూ ప్రైవేటు విద్యా సంస్థల సమాఖ్య మండిపడుతోంది. దీంతో ఫీజు రీ ఇంబర్స్‌మెంట్‌ విషయంలో ఏం జరగబోతోంది..అన్నది ఇంట్రెస్టింగ్‌గా మారింది.

ముగిసిన ప్రైవేటు కాలేజీల డెడ్‌లైన్‌.. సోమవారం నుంచి ప్రైవేట్‌ కాలేజీల నిరవధిక బంద్‌!
Private College

Updated on: Nov 02, 2025 | 8:00 AM

ఫీజు రీ-ఇంబర్స్‌మెంట్‌ బకాయిలపై ప్రభుత్వానికి ప్రైవేట్ కాలేజీలు ఇచ్చిన డెడ్‌లైన్‌ ముగిసింది…! మరోవైపు ప్రైవేట్ కాలేజీలపై విజిలెన్స్‌ తనిఖీలకు తెలంగాణ సర్కార్ ఆదేశించింది. బకాయిలు అడిగితే విజిలెన్స్‌ ఇన్‌స్పెక్షన్లతో కౌంటర్‌ అటాక్‌ చేస్తారా అంటూ ప్రైవేటు విద్యా సంస్థల సమాఖ్య మండిపడుతోంది. దీంతో ఫీజు రీ ఇంబర్స్‌మెంట్‌ విషయంలో ఏం జరగబోతోంది..అన్నది ఇంట్రెస్టింగ్‌గా మారింది.

ఫీజు రీఇంబర్స్‌మెంట్‌ బకాయిల కోసం తెలంగాణ సర్కార్‌తో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమైంది ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య. 10 వేల కోట్ల రూపాయల పెండింగ్‌ బకాయిల్లో…కనీసం వెయ్యి కోట్ల రూపాయలు అయినా చెల్లించమని ప్రైవేటు విద్యా సంస్థలు అడుగుతున్నాయి. 600 కోట్లు ఇస్తామని, 300 కోట్ల రూపాయలే ప్రభుత్వం ఇచ్చిందంటోంది విద్యాసంస్థల సమాఖ్య. పెండింగ్‌ బకాయిలు చెల్లించడానికి ప్రభుత్వానికి నవంబర్ 1దాకా ఇచ్చిన గడువు ముగియడంతో…సోమవారం నుంచి నిరవధిక బంద్‌ పాటించనున్నాయి విద్యా సంస్థలు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో సమ్మె సైరన్ మోగించారు. తెలంగాణవ్యాప్తంగా ఇంజినీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్, బీఎడ్, బీఈడీ, నర్సింగ్, లా, ఎంబీఏ… సహా వృత్తి విద్య కాలేజీలు మూతపడనున్నాయి.

అయితే ఫీజు రీయింబర్స్‌మెంట్, పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్ నిధుల కిందకు వచ్చే అన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు, కళాశాలలను సమగ్రంగా తనిఖీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల దుర్వినియోగాన్ని గుర్తించడానికి, పేద, వెనుకబడిన విద్యార్థుల కోసం ఉద్దేశించిన నిధులు సరిగ్గా ఉపయోగిస్తున్నారా లేదా? తెలుసుకునేందుకు తనిఖీలు నిర్వహించాలని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాన్ని ప్రభుత్వం ఆదేశించింది. ఈ విజిలెన్స్ బృందాలు తెలంగాణ అంతటా ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, B.Ed కోర్సులను అందించే ప్రొఫెషనల్ కళాశాలలతో పాటు డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ కళాశాలలను తనిఖీ చేస్తాయి. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, సీఐడీ, ఏసీబీ, ఇంటెలిజెన్స్, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, వరంగల్ పోలీసు కమిషనరేట్ల మద్దతుతో ఈ తనిఖీలు నిర్వహిస్తారు.

తాము బకాయిలు చెల్లించమని అడిగితే విజిలెన్స్‌ టీమ్స్‌తో ఇన్‌స్పెక్షన్‌ అంటూ సర్కార్‌ కౌంటర్‌ అటాక్‌ చేయడం దుర్మారం అంటున్నాయి ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు. విజిలెన్స్‌ దాడులకు భయపడేది లేదంటున్నారు వాళ్లు. 6వ తేదీన హైదరాబాద్‌లో 2లక్షలమంది లెక్చరర్లతో మీటింగ్‌ పెడతామని, 10 లేదా 11వ తేదీన 10లక్షలమంది విద్యార్థులతో సభ పెడతామని కార్యాచరణ ప్రకటించాయి ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు. ప్రైవేటు కాలేజీలు, ప్రభుత్వానికి మధ్య పోరులో విద్యార్థులు నలిగిపోయేలా ఉన్నారు. ఇది ఎటు దారితీస్తుందో చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..