Telangana: తెలంగాణలోని నిరుద్యోగులకు లాస్ట్ ఛాన్స్.. మార్చి 25 వరకే డెడ్ లైన్.. మిస్సవ్వకండి

తెలంగాణలోని నిరుద్యోగులకు అలర్ట్. టీజీపీఎస్సీ కీలక ప్రకటన జారీ చేసింది. వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నవారు అప్డేట్ చేసుకునేందుకు గడువును పొడిగించింది. మార్చి 25లోపు వివరాలను అప్డేట్ చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు తాాజాగా ప్రకటన విడుదల చేసింది. వాటి వివరాలు..

Telangana: తెలంగాణలోని నిరుద్యోగులకు లాస్ట్ ఛాన్స్.. మార్చి 25 వరకే డెడ్ లైన్.. మిస్సవ్వకండి
Unemployes

Updated on: Mar 10, 2026 | 9:53 PM

తెలంగాణలోని నిరుద్యోగులకు టీజీపీఎస్సీ బిగ్ అలర్ట్ జారీ చేసింది. టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు అప్డేట్ చేసుకోవాలని అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన గడువును పొడిగిస్తూ టీజీపీఎస్సీ నిర్ణయం తీసుకుంది. గతంలో ఫిబ్రవరి 25 వరకు గుడువు పొడిగించగా.. ఇంకా చాలామంది అభ్యర్థులు అప్డేట్ చేసుకోలేదు. దీంతో మార్చి 25వ తేదీ వరకు గడువు పొడిగిస్తున్నట్లు టీజీపీఎస్సీ తెలిపింది. జనవరి 17 నాటి వెబ్ నోట్ ప్రకారం నిర్దేశించిన గడువు మార్చి 25లోగా ఓటీఆర్ వివరాలను సరిచూసుకొని సరైన వివరాలను మాత్రమే నమోదు చేసుకోవాలని సూచించింది. సంబంధిత ధ్రువపత్రాలను అప్ లోడ్ చేసుకోవాలని సూచించింది.

మార్చి 25 వరకు గడువు

మార్చి 25లోగా అప్‌డేట్ చేసుకోవాలని టీజీపీఎస్సీ సూచించింది. తదుపరి ఎలాంటి అవకాశం ఉండదని, రానున్న రిక్రూట్ మెంట్‌లను ఇట్టి డేటాను మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్పష్టం చేసింది. https://www.tgpsc.gov.in వెబ్ సైట్లోకి వెళ్లి నిరుద్యోగులు వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంది. తమ పూర్తి వివరాలతో పాటు డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుంది. వ్యక్తిగత, విద్య వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. అనంతరం ఓ నెంబర్‌ను టీజీపీఎస్సీ కేటాయిస్తుంది. టీజీపీఎస్సీ విడుదల చేసే ఉద్యోగాలకు ఓటీఆర్ నెంబర్ ద్వారా లాగిన్ అయ్యి దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతీసారి ప్రత్యేకంగా ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఏ పోస్ట్‌కైనా ఈ ఓటీఆర్ ద్వారా సులువుగా దరఖాస్తు చేసుకోవచ్చు. దీని వల్ల నిరుద్యోగులు సమయం ఆదా అవుతుంది.

31.56 లక్షల మంది నమోదు

ఇప్పటివరకు దాదాపు రాష్ట్రవ్యాప్తంగా 31.56 లక్షల మంది అభ్యర్థులు వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నవారు ఎప్పటికప్పుడు వివరాలను అప్డేట్ చేయాల్సి ఉంటుంది. వివరాలను పరిశీలించి ధృవీకరించాల్సి ఉంటుంది. దీని వల్ల ఖచ్చితమైన సమాచారం టీజీపీఎప్సీ దగ్గర రియల్ టైంలో అందుబాటులో ఉంటుంది. ఇటీవల రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ జరగడం, అలాగే అభ్యర్థులు విద్యార్హతల్లో మార్పులు జరగడంతో వివరాలు అప్‌డేట్ చేసుకునేందుకు సమయం ఇవ్వాలని నిరుద్యోగులు కోరారు. దీంతో ఓటీఆర్‌లో మార్పులు చేసుకునేందుకు టీజీపీఎస్సీ అవకాశం కల్పిస్తోంది. ఈ ప్రక్రియలో భాగంగా వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్నవారు తమ పాస్ పోర్ట్ సైజు ఫొటో, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్లను మళ్లీ అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే వ్యక్తిగత, విద్యా, కేటగిరీ వివరాలను మరోసారి ధృవీకరించాల్సి ఉంటుంది.

Follow Us