Akbaruddin Owaisi: ‘సీఐపై వస్తున్న ఆరోపణల విషయంలో ఎంఐఎం నేతలకు నోటీసులు పంపించాం’: డీసీపీ రోహిత్ రాజు

|

Nov 24, 2023 | 9:16 AM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ పలువురు నాయకులు తమకు తోచినట్లు మాట్లాడుతున్నారు. సభా వేదికలపై కీలక ఆరోపణలు చేస్తున్నారు. ఇటీవల చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని సంతోష్ నగర్‌లో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. స్థానిక సీఐపై అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై దర్యాప్తు చేపట్టారు పోలీసు ఉన్నతాధికారులు. అయితే సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ సీఐ సభావేదికపైకి వచ్చినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని డీసీపీ రోహిత్ రాజు తెలిపారు.

Akbaruddin Owaisi: సీఐపై వస్తున్న ఆరోపణల విషయంలో ఎంఐఎం నేతలకు నోటీసులు పంపించాం: డీసీపీ రోహిత్ రాజు
Akbaruddin Owaisi
Follow us on

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలవేళ కొందరు నాయకుల వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. సభా వేదికలపై కీలక ఆరోపణలు చేస్తున్నారు. ఇటీవల చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని సంతోష్ నగర్‌లో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. స్థానిక సీఐపై అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై దర్యాప్తు చేపట్టారు పోలీసు ఉన్నతాధికారులు. అయితే సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ సీఐ సభావేదికపైకి వచ్చినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని సౌత్ ఈస్ట్ డీసీపీ రోహిత్ రాజు తెలిపారు.

ఎంఐఎం పార్టీ అధినేత బహిరంగ సభలో మాట్లాడుతుండగా.. సమయం అయిపోయిందని వేదికపైకి వచ్చి అక్బరుద్దీన్‌ను నిలువరించే ప్రయత్నం చేసినట్లు ఆ పార్టీ నేతలు చేసిన ఆరోపణలకు ఎలాంటి రుజువులు లభించలేదని వెల్లడించారు పోలీసు అధికారులు. దీంతో ప్రభుత్వ అధికారి విధులకు ఆటంకం కలిగించి, విద్వేషపూరిత ప్రసంగాలు చేసి అక్కడ గందరగోళ వాతావరణాన్ని సృష్టించారని డీసీపీ పేర్కొన్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై పోలీసు కమిషనర్ కూడా సమీక్షించారన్నారు. సీఐ వేదికపైకి ఎక్కినట్లు ఆధారాలు ఉంటే తమకు సమర్పించాలని అప్పుడు తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎంఐఎం నేతలకు నోటీసులు కూడా పంపించినట్లు సౌత్ ఈస్ట్ డీసీపీ రోహిత్ రాజు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..