Telangana Dalit Bandhu: గుడ్‌న్యూస్.. హుజూరాబాద్‌లో ఈనెల 16 నుంచే ద‌ళిత‌బంధు ప్రారంభం: సీఎం కేసీఆర్

|

Aug 01, 2021 | 11:17 PM

CM KCR on Dalit Bandhu scheme: తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఆదివారం ప్రగతి భవన్‌లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నెల 16వ తేదీ నుంచి హుజూరాబాద్

Telangana Dalit Bandhu: గుడ్‌న్యూస్.. హుజూరాబాద్‌లో ఈనెల 16 నుంచే ద‌ళిత‌బంధు ప్రారంభం: సీఎం కేసీఆర్
Cm Kcr Dalita Bandhu
Follow us on

CM KCR on Dalit Bandhu scheme: తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఆదివారం ప్రగతి భవన్‌లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నెల 16వ తేదీ నుంచి హుజూరాబాద్ నియోజకవర్గంలో ద‌ళిత బంధు ప‌థ‌కం ప్రారంభించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ద‌ళిత బంధు ప్రారంభానికి రాష్ట్ర ప్ర‌భుత్వం హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గాన్ని పైల‌ట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ క్ర‌మంలో భాగంగా ద‌ళిత‌బంధుకు చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పిస్తూ ప్ర‌త్యేక చ‌ట్టం తేవాల‌ని రాష్ట్ర మంత్రివర్గం అభిప్రాయ‌ప‌డింది. ఈ ప‌థ‌కంలో భాగంగా ద‌ళితుల‌కు ప్ర‌భుత్వం రూ.10 ల‌క్ష‌ల సాయం అంద‌జేయ‌నుంది. ల‌బ్దిదారులు క‌లిసి పెద్ద యూనిట్‌ను పెట్టుకునే అవ‌కాశం ఉంద‌ని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఇప్పటికే దళిత బంధు పథకం అమలు, విధి విధానాల రూపకల్పనపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, కేబినెట్ విస్తృతంగా చర్చించింది. \

అయితే.. ఈ కేబినెట్ సమావేశంలో దళిత బంధు పథకం అమలు, విదివిధానాలను సీఎం కెసీఆర్ చర్చించారు. రాష్ట్రంలోని ఆన్ని వర్గాల ఆకాంక్షలను నెరవేరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్నదనీ, ఫలితాలు ప్రజల అనుభవంలో ఉన్నాయనీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. పలు రంగాల వారికి ఇప్పటికే సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు. రైతుబీమా అమలవుతున్న విధంగానే నేత, గీత కార్మికులకు బీమా సదుపాయం కల్పించడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

దళిత జాతి పేదరికం రూపుమాపాలని ప్రవేశ పెడుతున్న తెలంగాణ దళితబంధు పథకాన్ని ఎలాంటి పక్షపాతం లేకుండా అమలుచేయాలని సీఎం కే చంద్రశేఖర్ రావు కోరారు. గతంలో ఎస్సీ ప్రగతి నిధి చట్టం తెచ్చి, ఒక వార్షిక బడ్జెట్ లో దళితులకు కేటాయించిన నిధులలో మిగిలిన నిధులను తరువాతి వార్షిక బడ్జెట్ కు బదలాయించే విధానం తీసుకొచ్చామన్నారు. ఆ విధానం దేశానికి ఆదర్శంగా నిలిచిందనీ, అదే విధంగా దళిత బందు కూడా దేశానికి దారి చూపే పథకం అవుతుందనీ కేసీఆర్ అభిప్రాయపడ్డారు. రెక్కల కష్టం తప్ప మరే ఆస్తి లేని దీనస్థితిలో దళిత ప్రజలు ఉన్నారని, రాష్ట్రంలో ఇరవై శాతం జనాభా ఉన్న దళితుల చేతుల్లో ఉన్న సాగుభూమి కేవలం పదమూడు లక్షల ఎకరాలేనని తెలిపారు. దళితుల పేదరికానికి ఇంతకు మించిన గీటురాయి లేదని.. ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

దళితబంధులో ఒక యూనిట్ పెట్టుకోవడానికి పదిలక్షల రూపాయల పెద్దమొత్తం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు సీఎం అన్నారు. బ్యాంకులతో అనుసంధానం పెట్టుకోలేదని, తిరిగి చెల్లించే భారం ఉంటే దళితుల ఆదాయంలో, ఆర్ధిక స్థితిలో మెరుగుదల రాదని ముఖ్యమంత్రి తెలియ జేశారు. లబ్దిదారులు ఒక సమూహంగా ఏర్పడి పెద్ద పెట్టుబడితో పెద్ద యూనిట్ పెట్టుకునే అవకాశాన్ని దళితబందు పథకం ద్వారా కల్పించనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా పలు విషయాలపై కేసీఆర్ మాట్లాడి.. అధికారులకు దిశానిర్థశం చేశారు.

 

Also Read:

Padi Koushik Reddy: పాడి కౌశిక్ రెడ్డిని బంపరాఫర్.. ఎమ్మెల్సీగా నియమించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయం

Telangana Covid-19: కాస్త ఉపశమనం.. తెలంగాణలో తగ్గుతున్న కరోనా ఉధృతి.. తాజాగా ఎన్ని కేసులంటే..?