Dalit Bandhu Scheme: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో దళిత బంధు పధకం అమలు!

|

Jan 22, 2022 | 4:43 PM

రాష్ట్రంలోని 118 శాసన సభ నియోజక వర్గాల్లో దళితబంధు పధకం అమలు చేయాలని నిర్ణయించారు. ప్రతీ నియోజక వర్గంలో కుటుంబాన్ని యూనిట్ గా తీసుకొని 100 మంది లబ్దిదారులను ఎంపిక చేయాలని నిర్ణయించారు.

Dalit Bandhu Scheme: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో దళిత బంధు పధకం అమలు!
Koppula Eshwar
Follow us on

Dalit Bandhu Scheme in Telangana: దళితబంధు పథకం అమలును వేగవంతం చేస్తోంది తెలంగాణ రాష్ట్ర సర్కార్‌. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. కరీంనగర్ కలెక్టరేట్ నుంచి మంత్రి కొప్పుల ఈశ్వర్ ఈ వీడియో కాన్ఫహాజరు కాగా, మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ నుంచి ఎస్.సి. కార్పొరేషన్ ఛైర్మెన్ శ్రీనివాస్, బీ.ఆర్.కె ఆర్ భవన్ నుండి సి.ఎస్ సోమేశ్ కుమార్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

రాష్ట్రంలోని 118 శాసన సభ నియోజక వర్గాల్లో దళితబంధు పధకం అమలు చేయాలని నిర్ణయించారు. ప్రతీ నియోజక వర్గంలో కుటుంబాన్ని యూనిట్ గా తీసుకొని 100 మంది లబ్దిదారులను ఎంపిక చేయాలని నిర్ణయించారు. ఈ ఆర్థిక సంవత్సరం మార్చి నెలలో 100 శాతం గ్రౌండింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు. స్థానిక శాసన సభ్యుల సలహాతో లబ్దిదారులను ఎంపిక చేసి జాబితాను సంబంధిత జిల్లా ఇంచార్జ్ మంత్రులతో ఆమోదింపచేయాలని సూచించారు. ప్రతీ లబ్దిదారుడికీ ఏ విధమైన బ్యాంకు లింకేజి లేకుండా 10 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తారు. లబ్ది దారుడు కోరుకున్న యూనిట్ నే ఎంపిక చేయాలని సూచించారు.

ఒక్కొక్క లబ్ధిదారుడికి మంజూరైన రూ.10 లక్షలనుండి పదివేల రూపాయలతో ప్రత్యేకంగా దళిత బంధు రక్షణ నిధి ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలోనే దళిత బంధు ఒక అద్భుతమైన పథకమని మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో దళిత బందుకు రూ. 1200 కోట్ల కేటాయించామన్నారు. ఇప్పటికే రూ. 100 కోట్లను విడుదల చేసామని తెలిపారు. విడతల వారీగా మిగతా నిధుల విడుదల చేయనున్నట్లు తెలిపిన మంత్రి.. ఇప్పటికే, వాసాల మర్రి, హుజురాబాద్ లలో దళిత బంధు అమలు లో ఉందని స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా మధిర నియోజక వర్గంలోని చింతకాని మండలం, సూర్యాపేట జిల్లాలోని తిరుమల గిరి మండలం, నాగర్ కర్నూల్ జిల్లాల్లోని చారగొండ మండలం, కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ మండలాల్లో కూడా అమలు చేస్తున్నామని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు.

Read Also… AP Corona Cases: ఏపీలో కొత్తగా 12,926 కరోనా కేసులు.. ఆ 2 జిల్లాల్లో వైరస్ టెర్రర్