AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘నాన్నా.. ఈ చొక్కాలు బాగున్నాయి’ అంటూ.. కళ్లెదుటే క్షణాల్లో కుప్పకూలి మృతి

కొన్ని రోజుల క్రితం దసరా సెలవులకు ఇంటికొచ్చిన 19 ఏళ్ల ఇంజినీరింగ్ విద్యార్థి రాఘవ తల్లిదండ్రుల కళ్లెదుటే గుండెపోటుతో కుప్పకూలి మృతిచెందాడు. ఖమ్మం జిల్లా వైరా పరిధిలోని గండగలపాడులో జరిగిన ఈ విషాద ఘటన కుటుంబ సభ్యులను కన్నీరుమున్నీరుగా చేసింది. అసలేం జరిగిందంటే..

‘నాన్నా.. ఈ చొక్కాలు బాగున్నాయి’ అంటూ.. కళ్లెదుటే క్షణాల్లో కుప్పకూలి మృతి
Engineering Student Dies Of Heart Attack
Srilakshmi C
|

Updated on: Oct 17, 2026 | 6:38 AM

Share

వైరా, అక్టోబర్ 17: దసరా పండగ సెలవుల కోసం ఇంటికి వచ్చిన ఓ యువకుడు తల్లిదండ్రుల కళ్లెదుటే గుండెపోటుతో కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. క్షణాల్లో జరిగిన ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ పరిధిలోని గండగలపాడులో శుక్రవారం (అక్టోబర్ 16) చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే..

గండగలపాడుకు చెందిన కిన్నెర కృష్ణ, విజయ దంపతుల కుమారుడు రాఘవ (19) హైదరాబాద్‌లోని ఓ కళాశాలలో ఇంజినీరింగ్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. దసరా పండగ సెలవులు రావడంతో రెండ్రోజుల క్రితమే ఇంటికి చేరుకున్నాడు. పండగకు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతాడనుకున్న తల్లిదండ్రులకు తీరని శోకం మిగిల్చాడు. శుక్రవారం ఉదయం బైక్‌పై దుస్తులు విక్రయించే ఓ వ్యక్తి వారి ఇంటి వద్దకు వచ్చాడు. దీంతో రాఘవ తల్లి విజయ దుస్తులను పరిశీలిస్తున్నారు. అదే సమయంలో నిద్రలేచి బయటకు వచ్చిన రాఘవ.. ‘నాన్నా.. నీకు ఈ చొక్కాలు బాగుంటాయి’ అంటూ తండ్రితో చెప్పి మంచంపై కూర్చున్నాడు. ఇంతలోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.

ఇవి కూడా చదవండి

అనూహ్యంగా జరిగిన ఈ ఘటనతో తల్లిదండ్రులు, సోదరి తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఏమైందో అర్థంకాక వెంటనే రాఘవకు సీపీఆర్‌ చేశారు. అనంతరం ఆటోలో వైరాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే రాఘవ మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. చేతికి అందివచ్చిన కుమారుడు కళ్లెదుటే ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. చిన్న వయసులోనే రాఘవ గుండెపోటుతో మృతిచెందడం గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

Follow Us
పండుగ వేళ గోల్డ్ కొనేవారికి ఊరట.. ధరలు ఒక్కసారిగా ఢమాల్..
పండుగ వేళ గోల్డ్ కొనేవారికి ఊరట.. ధరలు ఒక్కసారిగా ఢమాల్..
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. అక్టోబర్ 19న సెలవ్! ఎందుకంటే..
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. అక్టోబర్ 19న సెలవ్! ఎందుకంటే..
అసలు బతుకమ్మను ఎలా పేర్చాలి? మొదట పెట్టాల్సిన పువ్వు ఏదో తెలుసా?
అసలు బతుకమ్మను ఎలా పేర్చాలి? మొదట పెట్టాల్సిన పువ్వు ఏదో తెలుసా?
తల్లి ప్రేమ.. ఇచ్చినమాట.. నిజాయితీ! ప్రతి ఒక్కరూ చదవాల్సిన నీతికథ
తల్లి ప్రేమ.. ఇచ్చినమాట.. నిజాయితీ! ప్రతి ఒక్కరూ చదవాల్సిన నీతికథ
‘నాన్నా.. ఈ చొక్కాలు బాగున్నాయి’ అంటూ.. క్షణాల్లో కుప్పకూలి మృతి
‘నాన్నా.. ఈ చొక్కాలు బాగున్నాయి’ అంటూ.. క్షణాల్లో కుప్పకూలి మృతి
అక్టోబర్ 17 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగం, వ్యాపారంలో అనుకూలత
అక్టోబర్ 17 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగం, వ్యాపారంలో అనుకూలత
నవరాత్రుల ఏడో రోజు అమ్మవారి కాలరాత్రి రూపం.. పూజా విధానం..
నవరాత్రుల ఏడో రోజు అమ్మవారి కాలరాత్రి రూపం.. పూజా విధానం..
కిక్ సినిమాలో నటించిన ఈ భామ.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా
కిక్ సినిమాలో నటించిన ఈ భామ.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా
రెండు మూడు సినిమాలతో కనిపించకుండా మాయం అయ్యింది..
రెండు మూడు సినిమాలతో కనిపించకుండా మాయం అయ్యింది..
అప్పట్లో ఊపేసింది.. ఇప్పుడు కనిపించకుండా మాయం అయ్యింది
అప్పట్లో ఊపేసింది.. ఇప్పుడు కనిపించకుండా మాయం అయ్యింది