Hyderabad: అపార్ట్‌మెంట్ రేవ్ పార్టీ గురించి కీలక విషయాలు చెప్పిన డ్రగ్‌ కంట్రోల్‌ ఐజీ

|

Jul 26, 2024 | 6:52 PM

క్లౌడ్ 9 అపార్ట్‌మెంట్‌ రేవ్‌పార్టీ కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చారన్న సమాచారంతో ఆ కనెక్టివిటీపై ఫోకస్ పెట్టారు పోలీసులు. తెలంగాణను డ్రగ్‌ ఫ్రీగా చేయడమే లక్ష్యమన్నారు డ్రగ్‌ కంట్రోల్‌ ఐజీ కమలాసన్‌రెడ్డి.

Hyderabad: అపార్ట్‌మెంట్ రేవ్ పార్టీ గురించి కీలక విషయాలు చెప్పిన డ్రగ్‌ కంట్రోల్‌ ఐజీ
VB Kamalasan Reddy
Follow us on

హైదరాబాద్‌ హైటెక్ సిటీలోని క్లౌడ్ 9 అపార్ట్‌మెంట్‌లో నిర్వహించిన రేవ్ పార్టీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. రేవ్ పార్టీలో మొత్తం 20 మంది యువతీ, యువకులు పాల్గొన్నట్లు గుర్తించారు. విదేశీ మద్యంతో పాటు భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. రేవ్ పార్టీలో దొరికిన వారికి తల్లిదండ్రుల సంక్షేమంలో కౌన్సిలింగ్ ఇచ్చారు డ్రగ్‌ కంట్రోల్‌ ఐజీ కమలాసన్‌రెడ్డి. ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. 10 మందికి నోటీసులు ఇచ్చిన పోలీసులు.. మిగిలిన వారికి కౌన్సిలింగ్‌ ఇచ్చి పంపించారు. క్లౌడ్ 9 అపార్ట్‌మెంట్‌లో బర్త్ డే పార్టీ పేరుతో రేవ్ పార్టీ నిర్వహించారన్నారు కమలాసన్‌రెడ్డి. రేవ్ పార్టీ కేసులో స్టూడెంట్స్ కూడా ఉన్నారన్నారు. గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చారన్న సమాచారంతో ఆ కనెక్టివిటీపై ఫోకస్ పెట్టామన్నారు.

తెలంగాణవ్యాప్తంగా 600కుపైగా ఎన్‌డీపీఎస్‌ కేసులు నమోదయ్యాయన్నారు డ్రగ్‌ కంట్రోల్‌ ఐజీ కమలాసన్‌రెడ్డి. ఇప్పటివరకు 911 మందిని అరెస్ట్‌ చేయడంతో పాటు 3500 కిలోల గంజాయి సీజ్ చేశామన్నారు. తెలంగాణను డ్రగ్‌ ఫ్రీ చేయడమే లక్ష్యమన్నారు.  ఎంతో భవిష్యత్ ఉన్న యువత ఒక్కపూట సంతోషం కోసం బంగారు జీవితాలను బలి చేసుకోవ‌ద్ద‌ని సూచించారు. పిల్ల‌లు ఎక్కడికి వెళ్తున్నారు..? ఎవ‌రితో క‌లిసి తిరుగుతున్నారు..? అనే విష‌యాన్ని పేరెంట్స్ గుర్తించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు డ్రగ్‌ కంట్రోల్‌ ఐజీ కమలాసన్‌రెడ్డి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.