AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: పార్ట్‌టైం జాబ్ అన్నారు.. పనికట్టుకుని మరీ అతికించారు.. చివరికి సీన్ సితారయ్యింది

సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. రోజుకో కొత్త రకం నేరాలతో ప్రజల నుంచి దోచుకుంటున్నారు. నిరుద్యోగులే టార్గెట్‌గా సైబర్ కేటుగాళ్లు విజృంభిస్తున్నారు. పార్ట్‌టైం ఉద్యోగాల పేరుతో సైబర్ మోసగాళ్ళు నిండా ముంచుతున్నారు. అమాయక నిరుద్యోగులు సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకొని విలవిలలాడుతున్నారు. ఆ వివరాలు ఇలా..

Telangana: పార్ట్‌టైం జాబ్ అన్నారు.. పనికట్టుకుని మరీ అతికించారు.. చివరికి సీన్ సితారయ్యింది
Representative Image
M Revan Reddy
| Edited By: |

Updated on: Nov 17, 2025 | 8:36 PM

Share

సైబర్ మోసాల పట్ల అవగాహన లేని నిరుద్యోగులు అత్యాశకు పోయి ఆన్ లైన్‌లో పెట్టుబడి పెట్టి లక్షల రూపాయలు పోగొట్టుకుంటున్నారు. సైబర్ కేటుగాళ్లు నిరుద్యోగులే టార్గెట్‌గా ఏదో రకంగా నమ్మించి వారి బ్యాంక్ అకౌంట్స్ పూర్తిగా ఖాళీ చేస్తున్నారు. ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన ఓ యువకుడు నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలోని ఓ ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. భార్యాపిల్లలతో కలిసి చౌటుప్పల్‌లో అద్దెకు ఉంటున్నాడు. ఈ నెల 5న యువకుడి వాట్సాప్‌కు సైబర్ కేటుగాళ్లు ఓ మెసేజ్ పంపారు. దీంతో సదరు యువకుడు నాలుగు రోజుల పాటు సైబర్ నేరగాళ్లతో చాటింగ్ చేశాడు. పార్ట్ టైం జాబ్ పేరిట ఈజీగా మనీ సంపాదించవచ్చని వాట్సాప్‌లో యువకుడితో చాట్ చేశారు. ఆ తర్వాత యువకుడిని సైబర్ నేరగాళ్లు తమ వాట్సాప్ గ్రూప్‌లో చేర్చుకున్నారు.

ఇంటి వద్ద ఉంటూ పార్ట్ టైం జాబ్‌గా జర్మనీలోని హోటల్లో రూమ్స్ బుకింగ్ చేస్తే అధిక లాభాలు వస్తాయని సైబర్ నేరగాళ్లు నమ్మించారు. దీంతో ఈ నెల 10న యువకుడు తన ఫోన్ నంబర్‌తో ఐడీ క్రియేట్ చేసుకుని తన వివరాలను వారికి షేర్ చేశాడు. ఈ నెల 10న రూ. 800 పంపించగా.. సైబర్ మోసగాళ్లు రూ. 1020 లాభం చూపించారు. ప్రతిరోజు రూ.5 వేల నుంచి రూ.8వేల వరకు సంపాదించవచ్చని కేటుగాళ్ళు నమ్మించారు. ఇలా పలుమార్లు యువకుడు పెట్టిన పెట్టుబడికి మొత్తం రూ.40 వేలు లాభం వచ్చినట్లు మెసేజ్ పంపారు. కానీ ఆ డబ్బులను తమ వద్దనే పెట్టుకున్నామని, వాటికి మరింత తాము జమ చేస్తామని నమ్మించారు. అయినా యువకుడిని వదలకుండా కేటుగాళ్లు ప్రలోభాలకు గురి చేశారు. దీంతో బంధువు వద్ద ఐదు లక్షల రూపాయలను అప్పుగా తీసుకువచ్చి పెట్టుబడి పెట్టాడు. ఇలా మొత్తం రూ. 8,42,663లను పెట్టుబడి పెట్టించారు.

నీకు 90 పాయింట్లు వచ్చాయి, 100 పాయింట్లు పూర్తయితే లాభం పూర్తిగా చేతికి వస్తుందని నమ్మించారు. తక్కువగా ఉన్న 10 పాయింట్లను లక్ష రూపాయలతో కొనుగోలు చేయాలని నేరగాళ్లు ఒత్తిడి చేశారు. పార్ట్ టైం జాబ్ పేరుతో జరిగిన విషయాన్ని యువకుడు తన ఫ్రెండ్స్‌కు చెప్పాడు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయావని ఫ్రెండ్స్ చెప్పడంతో చౌటుప్పల్ పోలీసులను యువకుడు ఆశ్రయించాడు. వారి సూచనతో 1940 సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్