తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అనేక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. వివిధ శాఖల అధికారులతో సమీక్షలు, సమావేశాలు జరుపుతున్నారు. ప్రజలకు సంపూర్ణ సంక్షేమం అందించడమే తమ ప్రభుత్వం లక్ష్యంగా చెబుతున్నారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి అండ్ టీం తమ శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా భేటి అవుతున్నారు. శాఖపరమైన లోపాలను, సంక్షేమ పథకాల అమలుపై చర్చిస్తున్నారు. లోక్ సభ ఎన్నికలే లక్ష్యంగా పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా ఇన్ఛార్జులను నియమించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇదే క్రమంలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణలోని 10 ఉమ్మడి జిల్లాలకు ఇన్‌ఛార్జి మంత్రులను నియమించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..