CPI Narayana: గవర్నర్‌ దర్బార్‌ రాజకీయ దుమారం.. లక్ష్మణరేఖ దాటుతున్నారన్న నారాయణ

| Edited By: Ravi Kiran

Jun 09, 2022 | 7:19 PM

రాజ్‌భవన్‌ వేదికగా ప్రజాదర్బార్‌ నిర్వహిస్తామని గవర్నర్‌ ప్రకటించడం పొలిటికల్‌ సర్కిళ్లలో చర్చకు దారితీసింది. గవర్నర్‌ లక్ష్మణరేఖను దాటుతున్నారని విమర్శించారు సీపీఐ నేత నారాయణ. రాజ్‌భవన్‌ మరో అధికారిక కేంద్రంగా మారడాన్ని..

CPI Narayana: గవర్నర్‌ దర్బార్‌ రాజకీయ దుమారం.. లక్ష్మణరేఖ దాటుతున్నారన్న నారాయణ
Narayana
Follow us on

గవర్నర్‌ తమిళిసై డెసిషన్‌ పొలిటికల్‌ ప్రకంపనలు రేపుతోంది. ప్రజా సమస్యలపై గవర్నర్‌ దర్బార్‌ ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. మొన్నటిదాకా ప్రొటోకాల్‌ ఇష్యూపై పెద్ద రచ్చే నడిచింది. తాను ఎక్కడికి వెళ్లినా ప్రొటోకాల్‌ పాటించడం లేదంటూ సర్కార్‌పై ఇటీవల నేరుగా విమర్శలు గుప్పించారు గవర్నర్‌ తమిళిసై. కనీసం అధికారులు కూడా రావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారామె. పాడి కౌశిక్‌రెడ్డి ఎమ్మెల్సీ పదవి వ్యవహారంతో మొదలైన వివాదం.. సమ్మక్క-సారలమ్మ జాతరతో తారస్థాయికి చేరింది. జాతరలో ప్రొటోకాల్‌ పాటించలేదంటూ కాంట్రవర్సీకి తెరదీశారు తమిళిసై. అక్కడి నుంచి షురూ అయింది అసలు వివాదం.

తాజాగా రాజ్‌భవన్‌ వేదికగా ప్రజాదర్బార్‌ నిర్వహిస్తామని గవర్నర్‌ ప్రకటించడం పొలిటికల్‌ సర్కిళ్లలో చర్చకు దారితీసింది. గవర్నర్‌ లక్ష్మణరేఖను దాటుతున్నారని విమర్శించారు సీపీఐ నేత నారాయణ. రాజ్‌భవన్‌ మరో అధికారిక కేంద్రంగా మారడాన్ని తప్పుబట్టారు. ఇది పక్కా రాజకీయమేనని విమర్శించారాయన.

ఓవైపు విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రజాదర్బార్‌ నిర్వహణపై వెనక్కి తగ్గడం లేదు గవర్నర్ తమిళిసై. రేపు మధ్యాహ్నం 12 నుంచి ఒంటిగంట వరకు రాజ్ భవన్‌లో గవర్నర్ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసమే రాజ్ భవన్ ఉందని, నెలకోసారి ప్రజాదర్బార్‌ నిర్వహిస్తామని గవర్నర్ తమిళి సై ఇప్పటికే ప్రకటించారు. కాల్ చేయడం ద్వారా.. లేదా ఈమెయిల్ ద్వారా గవర్నర్ అపాయింట్‌మెంట్ పొందవచ్చని రాజ్ భవన్ అధికారులు చెప్పారు.