Covid-19 Hospital Bed Availability: తెలంగాణలో కరోనా మహహ్మారి తీవ్ర స్థాయిలో పెరిగిపోతోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇక తెలంగాణ ప్రభుత్వం ప్రతి రోజు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎన్ని బెడ్లు ఖాళీగా ఉన్నాయి, ఎన్ని ఆక్సిజన్ బెడ్లు ఖాళీగా ఉన్నాయి, ఎన్ని నిండి ఉన్నాయి, అలాగే ఐసీయూలో బెడ్లు ఎన్ని ఖాళీ ఉన్నాయి, ఎన్ని నిండి ఉన్నాయి అనే అంశాలు ప్రభుత్వం వెల్లడిస్తోంది. ఇక తాజాగా సోమవారం తెలంగాణలోప్రభుత్వ, ప్రైవేటులో బెడ్స్, ఐసీయూ, ఆక్సిజన్ బెడ్స్ తదితర వివరాలు అందజేస్తోంది.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో మొత్తం 5115 బెడ్స్ ఉండగా, అందులో 1042 బెడ్లు నిండి ఉండగా, 4073 బెడ్స్ ఖాళీగా ఉన్నాయి.
ప్రైవేటు ఆస్పత్రుల్లో.. మొత్తం 14405 బెడ్స్ ఉండగా, అందులో 3243 నిండి ఉండగా, 11162 ఖాళీగా ఉన్నాయి.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో .. మొత్తం ఆక్సిజన్ బెడ్స్ 6476 ఉండగా, అందులో 3260 బెడ్లు నిండి ఉండగా, 3216 ఖాళీగా ఉన్నాయి.
ప్రైవేటు ఆస్పత్రుల్లో.. మొత్తం ఆక్సిజన్ బెడ్స్10400 ఉండగా, 6566 బెడ్స్ నిండి ఉండగా, 3836 బెడ్స్ ఖాలీగా ఉన్నాయి.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో.. మొత్తం ఐసీయూలో బెడ్స్ 2120 ఉండగా, 1303 నిండి ఉండగా, 817 బెడ్స్ ఖాళీగా ఉన్నాయి.
ప్రైవేటు ఆస్పత్రుల్లో .. మొత్తం ఐసీయూ బెడ్స్ 6942 ఉండగా, అందులో 4325 బెడ్స్ నిండి ఉండగా, 2617 బెడ్స్ ఖాళీగా ఉన్నాయి.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో మొత్తం బెడ్స్ 13711 ఉండగా, అందులో 5605 బెడ్స్ నిండి ఉండగా, 8106 బెడ్స్ ఖాళీగా ఉన్నాయి.
ప్రైవేటు ఆస్పత్రుల్లో మొత్తం 31747 బెడ్స్ ఉండగా, అందులో 14134 బెడ్స్ నిండి ఉండగా, 17615 బెడ్స్ ఖాళీగా ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో బెడ్ల వివరాలు: http://164.100.112.24/SpringMVC/Hospital_Beds_Statistic_Bulletin_citizen.htm