AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దసరా అంటే మామూలుగా ఉండదు మరి.. నాటు కోడికి యమడిమాండ్.. కేజీ చికెన్, మటన్ ఎంతో తెలుసా..?

దసరా పండగ వేళ ఆంధ్రప్రదేశ్‌లో నాటు కోళ్లకు డిమాండ్ పెరిగింది. శ్రీకాకుళం జిల్లాలోని పలు సంతల్లో కిలో నాటు కోడి ధర సుమారు రూ.1,000 పలుకుతుండగా, ఒక్కో కోడి సైజును బట్టి రూ.1,000 నుంచి రూ.2,000 వరకు అమ్ముతున్నారు. పెరిగిన మటన్ ధరలతో పాటు నాటు కోళ్ల రేట్లు కూడా వినియోగదారులకు భారంగా మారాయి. నాటు కోడి పేరుతో గిరిరాజా కోళ్లను విక్రయిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో కొనుగోలుదారులు జాగ్రత్తగా ఉండాలి.

దసరా అంటే మామూలుగా ఉండదు మరి.. నాటు కోడికి యమడిమాండ్.. కేజీ చికెన్, మటన్ ఎంతో తెలుసా..?
Mutton Chicken Prices
Shaik Madar Saheb
|

Updated on: Oct 20, 2026 | 9:49 AM

Share

ఇదేంట్రా బాబు.. కోడి పుంజుకు ఏకంగా మటన్ రేటొచ్చింది! రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దసరా పండగొచ్చిందంటే చాలు.. ఇప్పుడు మార్కెట్లో నాటు కోళ్ల ధరలు చూస్తే మతిపోవాల్సిందే. అచ్చం కిలో మటన్ ఎంత ఉందో.. కిలో నాటు కోడి రేటు కూడా అంతే. అయినా సరే, పండగ పూట నోటికి రుచి ముఖ్యం బాసూ అంటూ నాన్-వెజ్ ప్రియులు ఎగబడి మరీ కొనేస్తున్నారు. దసరా అనగానే గుర్తొచ్చేది అమ్మవారి పూజలు, ఆ తర్వాత వచ్చే నాన్-వెజ్ ఘుమఘుమలు! విజయదశమి రోజున పూజలు చేసి అమ్మవారికి కోళ్లు, మేకలను బలి ఇవ్వడం ఆనవాయితీ. అయితే మార్కెట్లో గొర్రె, మేక ధరలు ఏకంగా రూ.10,000 పైనే పలుకుతుండటంతో.. అందరూ నాటు కోళ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇదే ఇప్పుడు డిమాండ్‌ను విపరీతంగా పెంచేసింది.

శ్రీకాకుళం జిల్లాలోని బుడుమూరు, నారాయణవలస, కొల్లివలస, కొజ్జిరి, అంపరం, మందస, అంభుగాం, పూండి, పాలకొండ, సీతంపేట సంతల్లో గత పది రోజులుగా నాటు కోళ్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. అయితే రేట్లే షాకిస్తున్నాయి! మార్కెట్లో కిలో మటన్ ధర వెయ్యి రూపాయలు ఉంటే… అచ్చం అదే రేటుకు కిలో నాటు కోడి కూడా అమ్ముడవుతోంది! కోడి సైజును బట్టి ఒక్కో నాటు కోడి లేదా పెట్ట ఏకంగా రూ.1,000 నుంచి రూ.2,000 వరకు పలుకుతోంది.

మార్కెట్లో బాయిలర్ కోళ్లు చవక ధరకే దొరుకుతున్నా… దసరా పండగ పూట అమ్మవారికి మొక్కలు చెల్లించడానికి, ఇంట్లో రుచిగా వండుకోవడానికి నాటు కోడికే ఎక్కువ డిమాండ్ ఉంది. బాయిలర్ రుచి వేరు, నాటు కోడి పులుసు రుచే వేరు కదా! అందుకే రేటు ఎంత ఉన్నా సరే, నాన్-వెజ్ ప్రియులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. కొనుగోలు చేయడానికి ఎగబడుతున్నారు.

మరోవైపు నాటు కోళ్ల డిమాండ్‌ను చూసి కొందరు వ్యాపారులు క్యాష్ చేసుకుంటున్నారు. నాటు కోళ్లని చెప్పి తక్కువ ధర ఉండే గిరిరాజా కోళ్లను అంటగట్టేస్తున్నారు! చూడటానికి రెండు ఒకేలా ఉన్నా… గిరిరాజా కోడి కిలో రూ.500 మాత్రమే.. కానీ నాటు కోడి రేటు మాత్రం రూ.1,000 పైనే

ఇటు మటన్ ధరలు సైతం కొండెక్కాయి. హైదరాబాద్, విజయవాడ సహా.. చాలా ప్రాంతాల్లో కిలో మటన్ రూ.1,200కి చేరగా.. మేకపోతు మాంసం ఏకంగా రూ.1,400 వరకు పలుకుతోంది. పండుగ పూట పెరిగిన ఈ ధరలతో సామాన్యుల జేబులకు భారీగా చిల్లు పడుతోంది.

ఇక బ్రాయిలర్ చికెన్ అయితే.. కేజీ 300 నుంచి 350 వరకు విక్రయిస్తున్నారు.

మొత్తానికి.. మటన్‌తో పోటీ పడుతున్న నాటు కోడి ధరలు జేబుకు చిల్లు పడుతున్నా సరే.. పండగ ఆనందం ముందు ఆ మాత్రం ఖర్చు లెక్కలేదంటున్నారు నాన్-వెజ్ ప్రియులు. ఏదేమైనా, అమ్మవారికి ఇష్టమైన నైవేద్యమైనా, ఇంటికి వచ్చే అతిథుల కోసం వండే విందైనా.. నాటు కోడి ఉంటేనే ఆ పండగ కళ వస్తుందంటున్నారు.

Follow Us
మటన్ ధరలకు ఏమాత్రం తగ్గని నాటు కోడి రేటు.. అయినా కొనుగోళ్లలో జోరు
మటన్ ధరలకు ఏమాత్రం తగ్గని నాటు కోడి రేటు.. అయినా కొనుగోళ్లలో జోరు
భారతదేశ ఆరోగ్య చిత్రం మారుతోందా?
భారతదేశ ఆరోగ్య చిత్రం మారుతోందా?
ఇంట్లో ఎర్తింగ్ సరిగ్గా లేకపోతే ఏమవుతుంది? ఏర్పాటు చేసే విధానం..
ఇంట్లో ఎర్తింగ్ సరిగ్గా లేకపోతే ఏమవుతుంది? ఏర్పాటు చేసే విధానం..
బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన ద్వారకాతిరుమల..
బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన ద్వారకాతిరుమల..
మహిళల ప్రీమియర్ లీగ్ వేలానికి ముహూర్తం ఫిక్స్.. వేదిక, సమయం ఇదే
మహిళల ప్రీమియర్ లీగ్ వేలానికి ముహూర్తం ఫిక్స్.. వేదిక, సమయం ఇదే
ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ వెజ్ మంచూరియా.. రుచి అదిరిపోతుంది!
ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ వెజ్ మంచూరియా.. రుచి అదిరిపోతుంది!
'నేను పుట్టాను.. అలసిపోయాను..' బేబీ పోజ్ కు నెట్టింట ఫిదా
'నేను పుట్టాను.. అలసిపోయాను..' బేబీ పోజ్ కు నెట్టింట ఫిదా
ఈ చిన్న సెట్టింగ్స్ మారిస్తే కరెంట్ బిల్లు సగానికి తగ్గుతుంది!
ఈ చిన్న సెట్టింగ్స్ మారిస్తే కరెంట్ బిల్లు సగానికి తగ్గుతుంది!
ఈ జ్యూస్‌ ఆరోగ్యానికి అమృతమే..! అద్భుతమైన ప్రయోజనాలు తెలిస్తే..
ఈ జ్యూస్‌ ఆరోగ్యానికి అమృతమే..! అద్భుతమైన ప్రయోజనాలు తెలిస్తే..
పచ్చి కొబ్బరితో 5 నిమిషాల్లోనే కమ్మని జున్ను.. తింటే మళ్లీ మళ్లీ
పచ్చి కొబ్బరితో 5 నిమిషాల్లోనే కమ్మని జున్ను.. తింటే మళ్లీ మళ్లీ