Corona Virus: కొవిడ్ థర్డ్ వేవ్ పీక్ స్టేజ్ చేరేది ఎప్పుడు? వైద్య నిపుణుల మాట ఇదే..

|

Jan 29, 2022 | 8:58 AM

Corona Virus: భారత దేశం(Bharath)లో థర్డ్ వేవ్(Third Wave) లో కేసులు భారీగా నమోదవుతున్నాయి. కోవిడ్ (Covid-19  ) కేసులతో పాటు కొత్త వేరియంట్ ఒమిక్రాన్(Omicron ) కేసులు కూడా రోజు రోజుకీ పెరుగుతున్నాయి...

Corona Virus: కొవిడ్ థర్డ్ వేవ్ పీక్ స్టేజ్ చేరేది ఎప్పుడు? వైద్య నిపుణుల మాట ఇదే..
Follow us on

Corona Virus: భారత దేశం(Bharath)లో థర్డ్ వేవ్(Third Wave) లో కేసులు భారీగా నమోదవుతున్నాయి. కోవిడ్ (Covid-19  ) కేసులతో పాటు కొత్త వేరియంట్ ఒమిక్రాన్(Omicron ) కేసులు కూడా రోజు రోజుకీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు , ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో వైరస్ వ్యాప్తి చాలా ఎక్కువగా ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే విషయంపై తాజాగా ప్రొఫెసర్ డాక్టర్ ఎం. విద్యాసాగర్ స్పందిస్తూ.. తెలంగాణతో సహా అనేక రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో ఒమిక్రాన్ వేరియంట్ తీవ్రతరం కానున్నట్లు చెప్పారు. ఫిబ్రవరి 15 నాటికి కరోనా కేసులు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో పీక్ స్టేజీకి వెళ్తాయని చెప్పారు. ముఖ్యంగా ఒమిక్రాన్ లక్షణలు కనిపించకుండా ఒకరి నుంచి ఒకరికి సులభంగా వ్యాపిస్తుందన్నారు. డెల్టాతో పోల్చినప్పుడు ఒమిక్రాన్ తీవ్రత చాలా తక్కువ అని, కొత్త వేరియంట్ కారణంగా తెలంగాణలో రోజువారీ కేసులు పెరుగుతాయని చెబుతున్నారు. అంతేకాదు పెద్దవారితో పోలిస్తే పిల్లల్లో ఈ వైరస్ ప్రభావం తక్కువేనని చెప్పారు. ఒకవేళ పిల్లలకు జలుబు, దగ్గు లాంటి లక్షణాలు ఉంటే.. ఆ తీవ్రత త్వరగానే తగ్గుతుందని తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు విద్యాసాగర్.

థర్డ్​ వేవ్ ఇప్పుడు ఫుల్​ స్పీడ్​ అవుతోంది.. వారం పది రోజుల్లో పీక్ స్టేజీకి చేరుకుంటుందని ప్రఖ్యాత సూత్ర కన్సార్టియం పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. డెల్టా సెకండ్ వేవ్‌తో పోల్చినప్పుడు మూడో వేవ్ సమయంలో ఆసుపత్రిలో చేరే బాధితుల సంఖ్య తక్కువగా ఉంటుందని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

Also Read:  ఆ జిల్లాకు ANR పేరు పెట్టండి.. ఏపీ సర్కారుకు అక్కినేని అభిమానులు వినతి