Corona Cases In Telangana: తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 65,997 నమూనాలను పరీక్షించగా.. 3464 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 5,47,727 చేరింది. ఇక నిన్న మహమ్మారి కారణంగా 25 మంది ప్రాణాలు కోల్పోగా… మొత్తం మృతుల సంఖ్య 3085కి పెరిగింది. అటు ఒక్క రోజులో 4801 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్ విడుదల చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 44,395 యాక్టివ్ కేసులు ఉన్నట్లు పేర్కొంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 534 మందికి పాజిటివ్ నిర్ధారణ అయినట్లు వెల్లడించింది.
ఇదిలా ఉంటే తెలంగాణ ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా వైద్య సేవలపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పెషల్ ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. ఇటీవల సీకింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిని సందర్శించిన ఆయన తాజాగా వరంగల్ ఎంజీఎంలో తనిఖీలు నిర్వహించారు. ఎంజీఎం ఆస్పత్రిలో నేరుగా కరోనా వార్డుకు వెళ్లి.. కరోనా బారినపడి చికిత్స పొందుతున్న బాధితులతో మాట్లాడారు. తానున్నానంటూ వారికి భరోసా కల్పించారు. ఎవరూ భయపడొద్దని ధైర్యం చెప్పారు.
Also Read:
ఒళ్లు గగుర్పొడిచే యాక్సిడెంట్.. గాల్లో పల్టీలు కొట్టిన కారు.. షాకింగ్ దృశ్యాలు..
గగుర్పొడిచే దృశ్యం.. పామును సజీవంగా మింగేస్తోన్న మరో పాము.. వీడియో వైరల్.!
SBI కస్టమర్లకు అలర్ట్.. మీ అకౌంట్ నుంచి రూ.147 డెబిట్ అవుతున్నాయా.? క్లారిటీ ఇచ్చిన బ్యాంక్.!