Controversy MLAs: మాజీ ఎమ్మెల్యేలను వెంటాడుతున్న వివాదాలు.. కొనసాగుతున్న కేసుల పర్వం..

తెలంగాణలో మాజీ ఎమ్మెల్యేలకు కేసుల భయం పట్టుకుంది. గతంలో వచ్చిన ఆరోపణలపై కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆయా మాజీ ప్రజా ప్రతినిధులపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు మాజీ ప్రజా ప్రతినిధులపై కేసులు నమోదు కాగా, మరో తాజా మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు.

Controversy MLAs: మాజీ ఎమ్మెల్యేలను వెంటాడుతున్న వివాదాలు.. కొనసాగుతున్న కేసుల పర్వం..
Police Case
Follow us

|

Updated on: Dec 30, 2023 | 8:23 PM

తెలంగాణలో మాజీ ఎమ్మెల్యేలకు కేసుల భయం పట్టుకుంది. గతంలో వచ్చిన ఆరోపణలపై కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆయా మాజీ ప్రజా ప్రతినిధులపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు మాజీ ప్రజా ప్రతినిధులపై కేసులు నమోదు కాగా, మరో తాజా మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు.

ఇక వివరాల్లోకి వెళ్తే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో పలు వివాదాలు అప్పటి ప్రజా ప్రతినిధులను వెంటాడుతున్నాయి. అయితే అప్పటి ప్రభుత్వం అధికారంలో ఉన్న కారణంగా కేసులో నమోదు చేసేందుకు పోలీసులు సైతం కాస్త వెనుకడుగు వేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన రోజు నుండి మాజీ ఎమ్మెల్యేలపై ఇప్పటికే పలుచోట్ల కేసులు నమోదు అవుతున్న విషయం తెలిసిందే..!

మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డిపై ఏకంగా అట్రాసిటీ కేసు నమోదు చేశారు షామీర్‌పేట్ పోలీసులు. ఒక భూమికి సంబంధించిన వ్యవహారంలో తమను మోసం చేశారని ఆరోపిస్తూ ఎమ్మెల్యే మల్లారెడ్డిపై బాధితులు పోలీసులను ఆశ్రయించారు. అయితే, మొదట మల్లారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేయలేదు. దీంతో కోర్టును ఆశ్రయించాడు బాధితుడు. కోర్టు సిఫారసుతో షామీర్‌పేట్ పోలీసులు కదిలారు. కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఎమ్మెల్యే మల్లారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తనపై నమోదైన కేసు కేవలం రాజకీయ ఉద్దేశపూర్వకంగానే నమోదు చేశారంటూ ఆ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు ఎమ్మెల్యే మల్లారెడ్డి. ప్రస్తుతం ఈ కేసు హైకోర్టు పరిధిలో ఉంది.

ఇక తాజాగా ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిపై ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. మున్సిపల్ చైర్ పర్సన్ స్రవంతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డితో పాటు నలుగురు మాజీ అధికారులపై కేసు నమోదు చేశారు. తనని కులం పేరుతో దూషిస్తున్నారంటూ మున్సిపల్ చైర్ పర్సన్ స్రవంతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రతి గతంలో తనకు మున్సిపల్ చైర్ పర్సన్ పదవి దక్కటానికి 2.5 కోట్లు రూపాయలు తీసుకున్నారని ఆమె ఆరోపించారు. ఆ తర్వాత తనను చైర్ పర్సన్ పదవి నుండి దింపి, వైస్ చైర్మన్ కు తన బాధ్యతలు అప్పజెప్పేందుకు అనేక రకాలుగా ప్రయత్నాలు చేశారని ఆమె ఆరోపించారు. దీంతోపాటు ప్రతిసారి తనను కులం పేరుతో దూషించారని మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డితో పాటు ఆయన కుమారుడు, అంతేకాదు మాజీ రంగారెడ్డి కలెక్టర్ అమోయ్ కుమార్ పై కేసు నమోదు చేశారు ఇబ్రహీంపట్నం పోలీసులు.

ఇక, తాజాగా ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు అందింది. ఒక భూ వివాదానికి సంబంధించి జీవన్ రెడ్డితో సామ దామోదర్ రెడ్డికి మధ్య కొన్ని నెలల పాటు వివాదం కొనసాగుతుంది. అయితే కొద్దిరోజుల క్రితం సామ దామోదర్ రెడ్డి మొబైల్ ఫోన్లకు పలువురు అగంతకులు చంపేస్తామని బెదిరింపులకు గురి చేస్తున్నారు. దీంతో రాజేంద్రనగర్ పోలీసులను ఆశ్రయించాడు బాధితుడు సామ దామోదర్ రెడ్డి. తనకు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పైనే అనుమానం ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ప్రస్తుతం జీవన్ రెడ్డిపై కేసు నమోదు చేయని పోలీసులు కేవలం బాధితుడికి వచ్చిన సెల్ ఫోన్ నెంబర్ ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..