Telangana: ఢిల్లీలో అసలేం జరుగుతోంది..? తెలంగాణ బీజేపీ నేతలు హస్తిన బాట పట్టడానికి కారణమేంటి.?

తెలంగాణ నేతలు వరుస పెట్టి ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారు. ఢిల్లీలో ముఖ్య నేతలను కలుస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు. అయితే ఈ ఢిల్లీ మీటింగ్ ఏంటి అని గల్లీలో విపరీతంగా చర్చలు నడుస్తున్నాయి. అందరూ కలిసి ఎందుకు ఢిల్లీ వెళ్తున్నారంటూ ఎవరికి నచ్చిన విశ్లేషణ వారు చేసుకుంటున్నారు. అధ్యక్ష మార్పుని కొందరు అనుకుంటుంటే, ఎన్నికల వ్యూహాలు...

Telangana: ఢిల్లీలో అసలేం జరుగుతోంది..? తెలంగాణ బీజేపీ నేతలు హస్తిన బాట పట్టడానికి కారణమేంటి.?
TS BJP

Updated on: May 21, 2023 | 6:40 AM

తెలంగాణ నేతలు వరుస పెట్టి ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారు. ఢిల్లీలో ముఖ్య నేతలను కలుస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు. అయితే ఈ ఢిల్లీ మీటింగ్ ఏంటి అని గల్లీలో విపరీతంగా చర్చలు నడుస్తున్నాయి. అందరూ కలిసి ఎందుకు ఢిల్లీ వెళ్తున్నారంటూ ఎవరికి నచ్చిన విశ్లేషణ వారు చేసుకుంటున్నారు. అధ్యక్ష మార్పుని కొందరు అనుకుంటుంటే, ఎన్నికల వ్యూహాలు అంటూ మరికొందరు విశ్లేషిస్తున్నారు ఇంతకు ఢిల్లీ వీధుల్లో నడుస్తున్న తెలంగాణ బీజేపీ రాజకీయం ఎంటి.? తెలంగాణ బిజెపి నాయకులంతా వరుస పెట్టి ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారు. బిజెపి నేతలు ఈటెల రాజేందర్ , కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి , వివేక్ వెంకటస్వామి ఢిల్లీ వెళ్లి విడివిడిగా అమిత్ షా తో భేటీ అయి వచ్చారు. తరువాత కొండా విశ్వేశ్వర్ రెడ్డి అమిత్ షా తో భేటీ అయ్యారు. నిన్న మొన్నటి వరకు బిజెపి సీనియర్ నేతలు లక్ష్మణ్ కిషన్ రెడ్డి బండి సంజయ్ కూడా ఢిల్లీలోనే ఉన్నారు.. వారందరూ ఒకరు ఒకరుగా హైదరాబాదు వస్తూ మరో నేత ఢిల్లీ వెళ్తున్నారు. ఇప్పుడు ఢిల్లీ వెళ్లే లిస్టులో రఘునందన్ వంతు వచ్చింది. ఇంతకు తెలంగాణ బిజెపి నాయకులు ఢిల్లీకి ఎందుకు క్యూ కట్టారు అనే చర్చ గల్లీలో జోరుగా సాగుతుంది.

ఢిల్లీ వెళ్లిన నాయకులందరూ కూడా విడివిడిగా అమిత్ షా తో భేటీ అయినట్టు తెలుస్తోంది. అందులో కొందరు పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ సునీల్ బన్సల్ కూడా సమావేశమైనట్టు సమాచారం. వారందరూ రానున్న ఆరు నెలల పాటు పార్టీని అధికారంలో తీసుకురావడానికి తీసుకోవాల్సిన కార్యచరణ పై వారిద్దరితో చర్చించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అధ్యక్ష మార్పు గురించి కూడా రాష్ట్ర బీజేపీ నేతల్లో జోరుగా చర్చ నడుస్తోంది.. కానీ ఢిల్లీ నేతలు మాత్రం అలాంటి చర్చ జరగలేదని కేవలం పార్టీ బలోపేతం, ఎన్నికల వ్యూహాల గురించి మాత్రం చర్చలు జరిగినట్టుగా సమాచారం. విడివిడిగా సమావేశమైన సందర్భంలో నేతల నుంచి అభిప్రాయాలు సలహాలు సూచనలు కూడా తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది.

అయితే రానున్న రోజుల్లో మరికొంత మంది నాయకులు ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలను కలిసిన తర్వాత బిజెపి పూర్తిస్థాయి యాక్షన్ ప్లాన్ తో తెలంగాణలో తమ ప్రణాళికలను మార్చబోతున్నట్లుగా సమాచారం. అధ్యక్ష మార్పు కాకుండా ఈటెల రాజేందర్‌కు మరింత బాధ్యతలు అప్పగించి పార్టీని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈటెల రాజేందర్, బండి సంజయ్ మధ్య ఉన్న దూరాన్ని తగ్గించాలని పార్టీ అధినాయకత్వం భావిస్తుందట.. ఇతర నేతల మధ్య ఉన్న సమన్వయ లోపాన్ని కూడా లేకుండా చేయాలని పార్టీ భావిస్తోంది అయితే పార్టీ జాతి నాయకత్వం తీసుకున్న నిర్ణయాలు రాష్ట్ర నాయకత్వం ఆమోదిస్తుందో లేదో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..