Telangana Assembly: కాంగ్రెస్ వర్సెస్ ఎంఐఎం.. పెద్ద కథే ఉంది.. అక్బరుద్దీన్‌కు కౌంటర్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి..

|

Dec 21, 2023 | 4:43 PM

తెలంగాణలో విద్యుత్‌పై అసెంబ్లీలో హాట్‌హాట్‌గా చర్చ కొనసాగుతోంది. ఈ క్రమంలో అధికార కాంగ్రెస్.. ఎంఐఎం పార్టీల మధ్య వాడీవేడిగా చర్చ జరిగింది. అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ తమను భయపెట్టాలని చూస్తే భయపడేది లేదంటూ పేర్కొన్నారు. కిరణ్‌ కుమార్ రెడ్డి హయాంలో తనను జైలుకు పంపారని మళ్లీ జైలుకు వెళ్లేందుకు సిద్ధమని, అధికారంలో ఉన్నవారు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ముస్లిం ప్రజల పక్షాన తాము పోరాడుతూనే ఉంటామని అక్బరుద్దీన్ స్పష్టం చేశారు.

Telangana Assembly: కాంగ్రెస్ వర్సెస్ ఎంఐఎం.. పెద్ద కథే ఉంది.. అక్బరుద్దీన్‌కు కౌంటర్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి..
Telangana Assembly
Follow us on

తెలంగాణలో విద్యుత్‌పై అసెంబ్లీలో హాట్‌హాట్‌గా చర్చ కొనసాగుతోంది. ఈ క్రమంలో అధికార కాంగ్రెస్.. ఎంఐఎం పార్టీల మధ్య వాడీవేడిగా చర్చ జరిగింది. అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ తమను భయపెట్టాలని చూస్తే భయపడేది లేదంటూ పేర్కొన్నారు. కిరణ్‌ కుమార్ రెడ్డి హయాంలో తనను జైలుకు పంపారని మళ్లీ జైలుకు వెళ్లేందుకు సిద్ధమని, అధికారంలో ఉన్నవారు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ముస్లిం ప్రజల పక్షాన తాము పోరాడుతూనే ఉంటామని అక్బరుద్దీన్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా.. విద్యుత్‌పై కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని అక్బరుద్దీన్‌ డిమాండ్ చేశారు. 200 యూనిట్లపై కాంగ్రెస్‌ వివరణ ఇవ్వాలన్నారు. ఉచిత విద్యుత్‌కు నిధులు ఎలా తెస్తారు? మహాలక్ష్మి, గృహజ్యోతిపై కాంగ్రెస్‌ క్లారిటీ ఇవ్వాలంటూ కోరారు. శ్వేతపత్రంలో అప్పులపై వివరాలు ఇచ్చారు. కానీ.. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు ఎలా నెరవేరుస్తారంటూ ప్రశ్నించారు. తెలంగాణలో విద్యుత్‌ వినియోగం పెరిగింది.. 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.. తలసరి విద్యుత్‌ వినియోగంలో తెలంగాణ నంబర్‌వన్‌.. పరిశ్రమలు, వ్యవసాయానికి 24 గంటల కరెంట్ వస్తోందని తెలిపారు. ప్రజాప్రతినిధిగా సమస్యలను ప్రస్తావించడం తన బాధ్యతని.. అక్బరుద్దీన్ పేర్కొన్నారు.

కాగా.. అక్బరుద్దీన్ ప్రసంగంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ పాలనలో మజ్లిస్‌ కూడా భాగమంటూ ఫైర్ అయ్యారు. సాటి ముస్లింలను ఓడించడానికి పనిచేశారంటూ రేవంత్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. అజారుద్దీన్‌ను, షబ్బీర్‌ అలీని ఓడించడానికి ఎంఐఎం పనిచేసిందంటూ సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. సాటి ముస్లింలను ఓడించడానికి మీరు పనిచేయలేదా..? అంటూ ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో ఎంఐఎం కూడా ఉంది.. ఆ ప్రభుత్వంలో తప్పులకు ఎంఐఎం బాధ్యత కూడా ఉంటుందన్నారు. ఈ క్రమంలో మజ్లిస్‌, బీఆర్ఎస్ సభ్యులు స్పీకర్‌ వెల్‌లోకి దూసుకొచ్చారు. దీంతో గందరగోళం మధ్యనే సీఎం ప్రసంగాన్ని కొనసాగించారు. ఎంఐఎం కథ చెప్పాలంటే పెద్ద చరిత్రే ఉందన్నారు. ఎంఐఎం సీనియర్ నేత పరిపక్వంగా మాట్లాడాలంటూ అక్బరుద్దీన్ కు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..