లోక్ సభ ఎన్నికల వేళ.. ఆ పార్టీలో తెరపైకి నాయకుల మధ్య విభేదాలు..

రాష్ట్ర కాంగ్రెస్‌లో రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారాయి. ఎంపీ టికెట్ల కోసం చాలా మంది నాయ‌కులు పోటీ ప‌డుతున్నారు. ఆయా ఎంపీ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆశావ‌హులు టికెట్ ద‌క్కించుకునేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు. అయితే సెంట్రల్ కమిటీ 4స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. దీంతో ఏ స్థానానికి ఎవ‌ర్ని ప్ర‌క‌టిస్తార‌నేది కాంగ్రెస్ పార్టీలో చ‌ర్చానీయాంశంగా మారింది.

లోక్ సభ ఎన్నికల వేళ.. ఆ పార్టీలో తెరపైకి నాయకుల మధ్య విభేదాలు..
Telangana Mlc Notification
Follow us

| Edited By: Srikar T

Updated on: Mar 10, 2024 | 9:47 PM

రాష్ట్ర కాంగ్రెస్‌లో రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారాయి. ఎంపీ టికెట్ల కోసం చాలా మంది నాయ‌కులు పోటీ ప‌డుతున్నారు. ఆయా ఎంపీ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆశావ‌హులు టికెట్ ద‌క్కించుకునేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు. అయితే సెంట్రల్ కమిటీ 4స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. దీంతో ఏ స్థానానికి ఎవ‌ర్ని ప్ర‌క‌టిస్తార‌నేది కాంగ్రెస్ పార్టీలో చ‌ర్చానీయాంశంగా మారింది. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు వి హ‌నుమంత‌రావు ప్రెస్ మీట్ పార్టీలో దూమారన్నే లేపుతున్నాయి. బీసి సామాజికవర్గానికి చెందిన నాయకుడుగా ఎప్పుడు ఏదో సమస్యపై పోరాడుతు ఉంటారు విహెచ్. రేవంత్ పిసిసి అయిన దగ్గర్నుండి ఇప్పటి వరకు ఇంటర్నల్ ఇష్యూపై మాట్లాడని విహెచ్ తనకు ఖమ్మం లోకసభ టికెట్ దక్కదనే ఉద్దేశంతో సీనియర్లకు అన్యాయం జరుగుతుందనే వాదన తెరపైకి తీసుకొచ్చారు.

ఖ‌మ్మం ఎంపీగా పోటీ చేసి తీరుతాను అని వీహెచ్ తేల్చిచెప్పారు. ఖ‌మ్మంలో చాలా సంవ‌త్స‌రాలుగా ప‌ని చేస్తున్నాను. ఖ‌మ్మం ప్ర‌జ‌ల‌కు జ‌రిగిన ప్ర‌తి అన్యాయంపై పోరాడాను. ఖ‌మ్మం నుంచి పోటీ చేయాల‌ని అక్క‌డి ప్ర‌జ‌లు కోరుతున్నారు. కాంగ్రెస్ కోసం త‌న కంటే ఎక్కువ క‌ష్ట‌ప‌డ్డ వాళ్లు ఉన్నారా.? సీఎం రేవంత్ రెడ్డిపై త‌న‌కు న‌మ్మ‌కం ఉంది. కొత్త‌వాళ్లు టికెట్లు అడిగితే త‌నలాంటి సీనియ‌ర్ల ప‌రిస్థితి ఏంటీ.? గ‌త ఎన్నిక‌ల్లో కూడా త‌న‌కు అన్యాయం జ‌రిగింద‌ని వీహెచ్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

అయితే ఖ‌మ్మం ఎంపీ టికెట్ కోసం డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క, నందిని తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇప్ప‌టికే తాను ఖ‌మ్మం ఎంపీ అభ్య‌ర్థిగా పోటీ చేస్తాన‌ని స‌హ‌చ‌రుల‌తో చెప్పిన‌ట్లు వార్త‌లు కూడా వ‌చ్చాయి. గాంధీభవన్‎లో దరఖాస్తు చేసుకునేటప్పుడు కూడా వందలాది మందితో వచ్చి టికెట్ నాదే అన్న సంకేతలు పంపారు. మరోవైపు ఆమెకు టికెట్ ఖ‌రారు కావ‌డంతోనే రేణుకా చౌద‌రిని రాజ్య‌స‌భ‌కు నామినేట్ చేసిన‌ట్లు కూడా వార్త‌లు వ‌చ్చాయి. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో వీహెచ్‌ ఖ‌మ్మం ఎంపీ టికెట్ ఎప్పటి నుండో అడుగుతున్నారని.. కావాలనే తనకురాకుండా చేస్తున్నారని అంటున్నారు. రేవంత్‎ను ముఖ్యమంత్రిగా సప్పోర్ట్ చేసినందుకె భట్టి విక్రమార్క తనకు టికెట్ దక్కకుండా చేస్తున్నారని.. కక్షపూరిత రాజకీయం జరుగుతుందంటున్నారు వి హెచ్. ఇన్నాళ్లు సైలెంట్‎గా ఉన్న విహెచ్ ఒక్కసారిగా వివాదాలకు తెర లేపారు. ఇది ఎటు పోయి.. చిలికిచిలికి గాలి వానలా మారతుందో వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..