వాళ్ళవల్లే నేను టాలీవుడ్‌కు దూరం అయ్యాను.. షాకింగ్ విషయం చెప్పిన ఇలియానా

ఈ చిన్నదానికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. ఆమె కోసమే సినిమాకు వెళ్లే వారు చాలా మంది ఉండేవారు. దేవదాసు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఇలియానా తొలి సినిమాతోనే భారీ హిట్ అందుకుంది. ఆతర్వాత ఈ చిన్నదానికి క్రేజీ ఆఫర్స్ వచ్చాయి.

వాళ్ళవల్లే నేను టాలీవుడ్‌కు దూరం అయ్యాను.. షాకింగ్ విషయం చెప్పిన ఇలియానా
Ileana D'cruz
Follow us

|

Updated on: Apr 30, 2024 | 9:19 PM

ఒకానొక సమయంలో టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా. ఈ చిన్నదానికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. ఆమె కోసమే సినిమాకు వెళ్లే వారు చాలా మంది ఉండేవారు. దేవదాసు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఇలియానా తొలి సినిమాతోనే భారీ హిట్ అందుకుంది. ఆతర్వాత ఈ చిన్నదానికి క్రేజీ ఆఫర్స్ వచ్చాయి. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు, పూరిజగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన పోకిరి సినిమాతో ఇలియానా పేరు మారుమ్రోగింది. పోకిరి సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. దాంతో స్టార్ హీరోలంతా ఇలియానా కోసం క్యూ కట్టారు. తెలుగులో చాలా సూపర్ హిట్ సినిమాల్లో నటించింది ఇలియానా. తెలుగుతో పాటు తమిళ్ లోనూ నటించింది. అలాగే హిందీలోనూ సినిమాలు చేసింది.

అయితే ఈ అమ్మడు బాలీవుడ్ కు వెళ్లిన తర్వాత తెలుగు సినిమాలకు దూరం అయ్యింది. బాలీవుడ్ లో ఒకటి రెండు సినిమాలు చేసింది కానీ అవి అంతగా హిట్ అవలేదు. అయితే ఈ క్రమంలోనే ప్రేమలో పడటం.. బ్రేకప్ చెప్పుకోవడం .. డిప్రషన్ లోకి వెళ్లడం.. బరువు పెరగడం ఇలా అని జరిగిపోయాయి. ఆ సమయంలో ఇలియానా గుర్తుపట్టలేనంతగా బరువు పెరిగిపోయింది.

డిప్రషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తెలుగులో ఓ సినిమాలో నటించింది. అమర్, అక్బర్, ఆంటోని అనే సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. దాంతో తెలుగు సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. ఆతర్వాత తిరిగి సన్నగా మారిపోయింది. అంతే కాదు పెళ్లి కాకుండానే తల్లిగా మారిపోయింది. ఇటీవలే ఇలియానా బిడ్డకు జన్మనించింది. ఇదిలా ఉంటే తాజాగా ఇలియానా తెలుగు సినిమాల గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఇలియానా మాట్లాడుతూ.. నేను హిందీ సినిమాలు చేయడంతో నేను సౌత్ సినిమాలు చేయనని కొంతమంది దర్శక నిర్మాతలు భావించారు. అందుకే నాకు తెలుగులో అవకాశాలు రాలేదు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో చేసిన సినిమాల్లో నేను చాలా నిజాయితీగా నా పని చేశాను. కానీ నాకు అనుకున్నంత గుర్తింపు రాలేదు. అలా ఎందుకు జరిగిందో నాకు ఇప్పటికి క్లారిటీ రాలేదు అని తెలిపింది ఇలియానా.

ఇలియానా ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
కొత్తగా గోంగూర చేపల పులుసు ఇలా చేయండి.. అమోఘం అంతే!
కొత్తగా గోంగూర చేపల పులుసు ఇలా చేయండి.. అమోఘం అంతే!
డయాబెటిస్‌ను కంట్రోల్ చేసే ఏడు సూత్రాలు.. ఇలా చేస్తే ఛూ మంత్రమే..
డయాబెటిస్‌ను కంట్రోల్ చేసే ఏడు సూత్రాలు.. ఇలా చేస్తే ఛూ మంత్రమే..
మూడు నెలల తర్వాత రాష్ట్ర కేబినెట్ భేటీ.. వీటిపైనే ప్రధాన చర్చ!
మూడు నెలల తర్వాత రాష్ట్ర కేబినెట్ భేటీ.. వీటిపైనే ప్రధాన చర్చ!
పామును మరో పాము మింగడం ఎప్పుడైనా చూశారా..? ఇదిగో వీడియో
పామును మరో పాము మింగడం ఎప్పుడైనా చూశారా..? ఇదిగో వీడియో
తెల్లగా ఉన్నాయ్ ఇవేం చేస్తాయిలే అనుకునేరు.. ఆ సమస్యలకు దివ్యౌషధం
తెల్లగా ఉన్నాయ్ ఇవేం చేస్తాయిలే అనుకునేరు.. ఆ సమస్యలకు దివ్యౌషధం
తుల‌సి నీళ్లు రోజూ తాగితే అమృతం తాగినట్లే.! అందం, ఆరోగ్యంతో పాటు
తుల‌సి నీళ్లు రోజూ తాగితే అమృతం తాగినట్లే.! అందం, ఆరోగ్యంతో పాటు
పిల్లలకు మన గ్రామీణ సంస్కృతిని పరిచయం చేయాలనుకుంటున్నారా..
పిల్లలకు మన గ్రామీణ సంస్కృతిని పరిచయం చేయాలనుకుంటున్నారా..
మళ్ళీ రెయిన్ అలర్ట్.. ఈ రూట్‌లో వెళితే ట్రాఫిక్ ఫికర్..!
మళ్ళీ రెయిన్ అలర్ట్.. ఈ రూట్‌లో వెళితే ట్రాఫిక్ ఫికర్..!
మహేష్‌ - రాజమౌళి మూవీ అప్‌డేట్‌ వచ్చేసినట్టేనా.!
మహేష్‌ - రాజమౌళి మూవీ అప్‌డేట్‌ వచ్చేసినట్టేనా.!
క్రెడిట్ కార్డు ఇలా వాడితే రివార్డులే రివార్డులు.. భారీగా ఆదా..
క్రెడిట్ కార్డు ఇలా వాడితే రివార్డులే రివార్డులు.. భారీగా ఆదా..