వయసు పెరుగుతోన్నా చెరగని అందంతో కుర్రకారు హృదయాలను కొల్లగొడుతోంది అందాల తార ప్రగ్యా జైస్వాల్. సినిమాల పరంగా పెద్దగా సక్సెస్ అందుకోని ఈ చిన్నది. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటుంది.
2022లో వచ్చిన సన్ ఆఫ్ ఇండియా తర్వాత మళ్లీ వెండి తెరపై కనిపించలేదీ బ్యూటీ. అయితే సోషల్ మీడియాలో మాత్రం నిత్యం ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటుంది.
ఇంత వయసులో కూడా చెక్కు చెదరని అందంతో ఆకట్టుకుంటోన్న ప్రగ్యా తన ఫిట్‌నెస్ సీక్రెట్ ఏంటో ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.
చిన్నప్పటి నుంచి తనకు యోగా చేయడం అలవాటు లాటిందని తెలిపిన ఈ బ్యూటీ అదే ఇప్పుడు తనకు ఒక అలవాటుగా మారిందని చెప్పుకొచ్చింది.
వ్యాయామానికి పెద్ద పీట వేసే ఈ చిన్నది.. పుషప్స్, స్కాట్స్ చేస్తానని. వారానికి అయిదు రోజులు.. రోజూ ఓ గంట వ్యాయామానికి తప్పకుండా కేటాయిస్తానని తెలిపింది.
ఇక వ్యాయామంలో భాగంగా రోజు విడిచి రోజు డ్యాన్స్ చేస్తానని తెలిపిన ప్రగ్యా... తన ఫిట్‌నెస్ సీక్రెట్‌కు డ్యాన్స్ కూడా ఒక కారణమని తెలిపింది.
ఇక తాను నాజుగ్గా ఉండడానికి తీసుకునే ఆహారం కూడా కారణమని ఈ బ్యూటీ తెలిపింది. బయటి ఫుడ్ తినడానికి ప్రగ్యా పెద్దగా ఆసక్తి చూపిందంటా.