11 నెలల తరువాత ఓటీటీ లో సందడి చేస్తున్న పాయల్ రాజపుత్ సినిమా
Phani.ch
17 May 2024
ప్రస్తుతం ఓటీటీల హవా ఎంతగా పెరుగుతూ వస్తోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పాత చిత్రాల దగ్గర నుండి కొత్త చిత్రాల అరకు ఓటీటీల్లోకి తీసుకు వచ్చి క్యాష్ చేసుకుంటున్నారు.
ఇది ఇలా ఉంటే తాజాగా ఓ సినిమా ఓటీటీ లో సందడి చేస్తుంది. ఆర్‌ఎక్స్ 100 ఫేం పాయల్ రాజ్‌పుత్ లీడ్ రోల్‌లో నటించిన మూవీ 'మాయా పేటిక'.
ఈ సినిమా 11 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చి సందడి చేస్తుంది. అయితే ఈ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది వంటి విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
బేబీ సినిమాలో రెండో హీరోగా కనిపించిన విరాజ్ అశ్విన్, ఆర్ఎక్స్ 100 సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన పాయల్ రాజ్ పుత్ లు హీరోహీరోయిన్లుగా చేసిన క్రేజీ మూవీయే మాయా పేటిక.
ఈ సినిమాలో వీరు మాత్రమే కాకుండా హీరో సునీల్, హిమజ, యాంకర్ శ్యామల, సిమ్రత్ కౌర్, పృథ్వీరాజ్, శ్రీనివాసరెడ్డి, రజత్ రాఘవలు ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు.
రమేష్ రాపర్తి దర్శకత్వం వహించిన ఈ సినిమాను మాగుంట శరత్ చంద్రారెడ్డి, తారక్ నాథ్ బొమ్మిరెడ్డిలు నిర్మించారు. అలాగే గుణ బాలసుబ్రమణ్యం ఈ కామెడీ థ్రిల్లర్ ఎంటర్ టైనర్ కు సంగీతం అందించారు.
అయితే గతేడాది జూన్ 30వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల చేశారు. కానీ అనుకున్న స్థాయిలో ఈ చిత్రం హిట్ కొట్టలేకపోయింది.
ముఖ్యంగా ఈ సినిమాలో హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ సెల్ ఫోన్ ను గిఫ్టుగా అందుకుంటుంది. అయితే ఆ తర్వాత ఈమె లైఫ్ ఎలా మారిపోయింది అనేది అసలు కథ.