Telangana: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎమ్మెల్యే హరీష్‌ రావు లేఖ.. ఏమన్నారంటే..

రాజకీయాలు కాకుండా రైతు ప్రయోజనాలపై దృష్టి సారించాలన్నారు మాజీమంత్రి హరీష్ రావు. నీళ్లు లేక కొత్త బోర్లు వేసుకొని రైతులపైన ఆర్థిక భారం పడుతుందని, ఆరుగాలం శ్రమించి వరి పంట సాగుచేస్తున్న అన్నదాతల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు. రంగనాయక సాగర్‎లోకి వెంటనే 1 టీఎంసి నీటిని ఎత్తిపోయాలని, ఆందోళనలో ఉన్న రైతుల సమస్యను పరిష్కారించకుంటే పోరాటానికి సిద్ధం అన్నారు.

Telangana: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎమ్మెల్యే హరీష్‌ రావు లేఖ.. ఏమన్నారంటే..
Harish Rao
Follow us

| Edited By: Srikar T

Updated on: Mar 10, 2024 | 7:13 PM

రాజకీయాలు కాకుండా రైతు ప్రయోజనాలపై దృష్టి సారించాలన్నారు మాజీమంత్రి హరీష్ రావు. నీళ్లు లేక కొత్త బోర్లు వేసుకొని రైతులపైన ఆర్థిక భారం పడుతుందని, ఆరుగాలం శ్రమించి వరి పంట సాగుచేస్తున్న అన్నదాతల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు. రంగనాయక సాగర్‎లోకి వెంటనే 1 టీఎంసి నీటిని ఎత్తిపోయాలని, ఆందోళనలో ఉన్న రైతుల సమస్యను పరిష్కారించకుంటే పోరాటానికి సిద్ధం అన్నారు. రైతులపక్షాన అండగా నిలుస్తాం అన్నారు. సిద్దిపేట జిల్లా రైతాంగ ప్రయోజనాల దృష్ట్యా ఒక లేఖ ద్వారా కొన్ని ముఖ్యమైన అంశాలు తమ దృష్టికి తీసుకువస్తున్నానన్నారు. రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతుల పక్షాననిలబడి తక్షణమే సమస్యను పరిష్కరించాలని కోరుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గాల్లో సాగుచేస్తున్న యాసంగి పంటలు చేతికి రావాలంటే వెంటనే సాగు నీరందించాలని విజ్ఞప్తి చేశారు.

గడిచిన నాలుగేళ్లలో ముందస్తు ప్రణాళిక ప్రకారం రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా సరిపడా సాగునీటిని అందుబాటులో ఉంచడం జరిగిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో అలసత్వం వహిస్తున్నట్లుగా అర్థమవుతుందన్నారు. ఓ పక్క సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయి. కళ్ళముందే ఎండిపోతున్న పంటలను కాపాడుకోవడానికి రైతులు అష్టకష్టాలు పడుతున్నారని చెప్పారు. కొత్త బోర్లు వేయిస్తూ అప్పుల పాలవుతున్నారని.. వ్యవసాయ బావులకు సంబంధించి పూడికతీత పనుల్లో రైతులు నిమగ్నమయ్యారని తెలిపారు. ఈ దుస్థితిని అధిగమించాలంటే వెంటనే రంగనాయక సాగర్ రిజర్వాయర్‎లోకి 1 టీఎంసీ నీటిని ఎత్తిపోయాలని కోరారు. మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుండి కూడా తక్షణమే నీటిని విడుదల చేయాలన్నారు. రైతులకు తగిన పరిష్కారం చూపించకుంటే త్వరలోనే రైతుల పక్షాన పోరాటాలకు సైతం సిద్ధమవుతామని స్పష్టం చేసారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles