Telangana: ఆకలి తీర్చుకునేందుకు శునకం.. హైవేపై కిలో మీటరు పరుగు.. చివరికి ఏం జరిగిందంటే..?

విశ్వాసానికి మారు పేరు కుక్క. విశ్వాసం లోనే కాదు.. కూటి కోసం కోటి విద్యలు అన్నట్లుగా.. ఒక కుక్క వేసవి కాలంలో ఆకలికి అల్లాడిపోయింది. తన ఆకలి తీర్చుకునేందుకు హైవేపై ఏకంగా ఒక కిలోమీటరు పరుగు తీసింది. ఆ తరువాత ఏమైందో తెలియాలంటే ఇది చదవాల్సిందే మరీ...!

Telangana: ఆకలి తీర్చుకునేందుకు శునకం.. హైవేపై కిలో మీటరు పరుగు.. చివరికి ఏం జరిగిందంటే..?
Hunger Dog
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: May 21, 2024 | 10:23 AM

విశ్వాసానికి మారు పేరు కుక్క. విశ్వాసం లోనే కాదు.. కూటి కోసం కోటి విద్యలు అన్నట్లుగా.. ఒక కుక్క వేసవి కాలంలో ఆకలికి అల్లాడిపోయింది. తన ఆకలి తీర్చుకునేందుకు హైవేపై ఏకంగా ఒక కిలోమీటరు పరుగు తీసింది. ఆ తరువాత ఏమైందో తెలియాలంటే ఇది చదవాల్సిందే మరీ…!

అయితే అసలే వేసవి కాలం.. అందులోనూ సత్తుప లో ఎండలు బాగా మండిపోతున్నాయి. ఈ ఎండలకి మనుషులే అల్లాడిపోతున్నారు. అలాంటిది పాపం ముగా జీవాలు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఒక వీధి కుక్క తన ఆకలి తీర్చుకునేందుకు పడ్డ పాట్లు చూస్తే అయ్యో అనకుండా ఉండలేరు. సత్తుపల్లిలోని పాత సెంటర్‌లోని రెడ్ బకెట్ బిర్యాని పాయింట్ వద్ద ఒక వ్యక్తి బిర్యాని తిని మిగిలిన బిర్యాని ఒక కవర్ లో పెట్టి పక్కనే పడవేశాడు.

సత్తుపల్లి లో ఫెమస్ అయిన బిర్యాని పాయింట్ వద్ద మనుషులతో పాటు మూగ జీవాలు కూడా ఎదురు చూస్తుంటాయి. మనుషులు తినగ మిగిలిన బిర్యాని కవర్ లో కట్టి బయటకు విసిరేస్తారు. అలాంటి బీర్యానికి ఒక వీధి కుక్క రుచికి అలవాటు పడింది. ఆ బిర్యాని పాయింట్ నుంచి బస్ స్టేషన్ వరకు కిలోమీటరు దూరం నేషనల్ హైవే పై పరుగు తీస్తూ.. నోటితో బిర్యాని కవర్ పట్టుకుని ట్రాఫిక్ కు ఎక్కడ అంతరాయం కలగకుండా క్రమశిక్షణగా పరుగు తీసింది.

ఈ వీడియో చూడండి…

ఇది ఒక్క రోజు జరిగేది కాదు. రెగ్యులర్ గా తనకు నచ్చిన బిర్యానిలో చికెన్ ముక్కలు తినేందుకు రోజు పరుగులు తీస్తూనే ఉంటుంది. అది తినేది ఎదో అక్కడే తినవచ్చు కదా అనుకుంటే పొరపాటు..! కుక్కలు చింపిన విస్తరి అంటుంటాం కదా..! అలా కాకుండా వేరే కుక్కలకు కంట పడకుండా చాలా తెలివి గా బిర్యాని కవర్ నోటితో పట్టుకుని కిలోమీటరు పరుగు తీసి.. తోటి కుక్కలు ఏమి లేని ప్రదేశానికి చేరుకుంటుంది. అక్కడ ప్రశాంతంగా ఆ బిర్యాని కవర్ లో ఉన్న చికెన్ బోన్స్, మాంసం, బిర్యాని తిని ఆ విధి కుక్క ఆకలి తీర్చుకుంటున్నాయి. ఇది చూసి పట్టణ వాసులు ఔరా అంటున్నారు. కుక్క కు విశ్వాసం తో పాటు.. బిర్యాని అంటే మోజే…అనుకుంటున్నారు..!

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…