Telangana: ఖమ్మంలోనే ఎందుకు? షర్మిలపై రేణుకా చౌదరి ఇంట్రస్టింగ్ కామెంట్స్..

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి మరింత యాక్టీవ్ అయ్యారు. రాహుల్ గాంధీ సభ అనంతరం ఆమె నిత్యం మీడియా ముందుకు వస్తున్నారు. తాజాగా మీడియాతో మాట్లాడిన రేణుకా చౌదరి.. వైఎస్ షర్మిలపై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు.

Telangana: ఖమ్మంలోనే ఎందుకు? షర్మిలపై రేణుకా చౌదరి ఇంట్రస్టింగ్ కామెంట్స్..
Renuka Chowdhury

Updated on: Jul 09, 2023 | 3:31 PM

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి మరింత యాక్టీవ్ అయ్యారు. రాహుల్ గాంధీ సభ అనంతరం ఆమె నిత్యం మీడియా ముందుకు వస్తున్నారు. తాజాగా మీడియాతో మాట్లాడిన రేణుకా చౌదరి.. వైఎస్ షర్మిలపై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. షర్మిల పొలిటికల్ ఎంట్రీ, ఖమ్మం నుంచి పోటీ అంశాలను ఆమె ఎదుట ప్రస్తావించగా.. తనదైన శైలిలో ఆన్సర్ ఇచ్చారు. అసలు షర్మిల ఎవరో కూడా తనకు తెలియదన్నారు. ‘షర్మిలది ఆంధ్రా.. వాళ్ల అన్న అక్కడే ఉన్నారు. తెలంగాణలో పొలిటికల్ పార్టీ పెట్టినా.. రాష్ట్రమంతా వదిలి వారంతా ఖమ్మంలోనే ఎందుకు ఉన్నారు?’ అంటూ ప్రశ్నించారు రేణుకా చౌదరి. ఖమ్మం నుంచి తనను పంపే కుట్రలు ఏమైనా జరుగుతున్నాయా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. తనను ఖమ్మం నుంచి పంపే మొనగాడు ఇంకా పుట్టలేదంటై తన మార్క్ లెవల్ కామెంట్స్‌‌తో రిప్లై ఇచ్చారు.

ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వంపైనా సంచలన కామెంట్స్ చేశారు రేణుకా చౌదరి. మోదీ ప్రభుత్వం ముందస్తు ఎన్నికల ఆలోచనలో ఉందని అన్నారు. తెలంగాణ ఎన్నికలతో పాటే.. లోక్‌సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. అయితే, ఎప్పుడు ఎన్నికలు జరిగినా.. కేంద్రంలో, తెలంగాణలో అధికారం కాంగ్రెస్‌ పార్టీదేనని ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ ఖమ్మం సభ తరువాత బీఆర్ఎస్, బీజేపీలో భయం మొదలైందన్నారు రేణుకా చౌదరి. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు చాలామంది రెడీగా ఉన్నారని చెప్పారు.

ఇక తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు మార్పుపైనా తనదైన శైలిలో విమర్శలు చేశారు. బీఆర్ఎస్, బీజేపీ పొత్తుకు ఇదే నిదర్శనం అని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉంటారనే కిషన్ రెడ్డిని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా నియమించారని అన్నారు. అధికారం కోసం ఎవరెన్ని ఎత్తులు వేసినా.. తెలంగాణలో కాంగ్రెస్‌దే అధికారం అని ధీమా వ్యక్తంచేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు షాక్ తప్పదని జోస్యం చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..