DK Shiva Kumar: గెలిచే ఎమ్మెల్యేలు చేజారకుండా కాంగ్రెస్ హైకమాండ్ అలర్ట్.. రంగంలోకి దిగిన డీకే శివకుమార్..

|

Dec 02, 2023 | 11:46 AM

Telangana Assembly Elections: తెలంగాణ ఎన్నికలకు సంబంధించి అత్యంత కీలకమైన ఓట్ల లెక్కింపు రేపు జరుగుతుండటంతో కాంగ్రెస్‌ పార్టీ అప్రమత్తమైంది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి చాలా పకడ్బందీగా వ్యవహరించేందుకు సమాయత్తమవుతోంది. తమ పార్టీ అధికారంలోకి వస్తుందని గట్టిగా నమ్ముతున్న కాంగ్రెస్‌ .. గెలిచిన అభ్యర్థులు చేజారిపోకుండా చూసేందుకు పావులు కదుపుతోంది.

DK Shiva Kumar: గెలిచే ఎమ్మెల్యేలు చేజారకుండా కాంగ్రెస్ హైకమాండ్ అలర్ట్.. రంగంలోకి దిగిన డీకే శివకుమార్..
Congress Party
Follow us on

Telangana Assembly Elections: తెలంగాణ ఎన్నికలకు సంబంధించి అత్యంత కీలకమైన ఓట్ల లెక్కింపు రేపు జరుగుతుండటంతో కాంగ్రెస్‌ పార్టీ అప్రమత్తమైంది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి చాలా పకడ్బందీగా వ్యవహరించేందుకు సమాయత్తమవుతోంది. తమ పార్టీ అధికారంలోకి వస్తుందని గట్టిగా నమ్ముతున్న కాంగ్రెస్‌ .. గెలిచిన అభ్యర్థులు చేజారిపోకుండా చూసేందుకు పావులు కదుపుతోంది. ఈ విషయంలో పరిస్థితిని పరిశీలించేందుకు కాంగ్రెస్‌ హైకమాండ్‌ కర్నాటక డిప్యూటీ సీఎం DK శివకుమార్‌ను హైదరాబాద్‌కు పంపిస్తోంది. తమ అభ్యర్థులంతా తమ పార్టీతోనే ఉంటారని DK శివకుమార్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, తమ పార్టీ అభ్యర్థులు కొందరితో బీఆర్ఎస్ పెద్దలు నేరుగా మాట్లాడారని ఆరోపించారు. తమ అభ్యర్థులు ఈ వ్యవహారంపై తమకు పూర్తి సమాచారం అందించారని శివకుమార్‌ వెల్లడించారు. తాను హైదరాబాద్‌ వెళ్తున్నానని.. తమ ఎమ్మెల్యేలంతా తమ వెంటే ఉంటారని.. తాము చాలా జాగ్రత్తగా ఉన్నామని డి.కె.శివకుమార్‌ పేర్కొన్నారు.

సాధారణంగా ఎగ్జిట్ పోల్స్‌ను తాను నమ్మనని, తాను సొంత పోస్ట్‌ పోల్‌ సర్వేలు చేయిస్తానని డీకే శివకుమార్ చెప్పారు. తన సొంత సర్వే ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్‌కు పెద్ద వేవ్‌ ఉందని తెలిపారు. తెలంగాణ, మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పవర్‌లోకి రావడం ఖాయమని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ నేతలను కేసీఆర్‌ లాక్కోవడం ఈసారి కుదరదన్నారు. తెలంగాణ, మధ్యప్రదేశ్‌లో గెలిచే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను బెంగళూరులోని రిసార్టులకు తరలించే ప్రశ్నే ఉత్పన్నం కాదని.. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను ఎవరూ కొనలేరని వారంతా పార్టీకి విధేయులంటూ డీకే పేర్కొన్నారు.

వీడియో చూడండి..


తెలంగాణ పోలింగ్ ఫలితాల కవరేజ్ కోసం..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.