నమ్మకంగా ఉంటూ నిండా ముంచాడు.. ఓనర్‌కు భలే షాక్ ఇచ్చిన కలెక్షన్ బాయ్..!

హైదరాబాద్ మహానగరంలో ఓ కలెక్షన్ బాయ్ వ్యవహారం తన షాప్ యజమానికి హార్ట్ ఎటాక్ తెప్పించేంత పని అయ్యింది. తనని నమ్మి యజమాని పని అప్పచెపితే, తన అవసరం కోసం సోమ్ము చేసుకుని వాడుకున్నాడు. తీరా యజమాని పోలీసులను ఆశ్రయించడంతో కటకటాల పాలయ్యాడు. నమ్మిన బంగారు దుకాణం వ్యాపారికి టోకరా ఇచ్చిన ఉద్యోగి 7లక్షల రూపాయలతో కలెక్షన్ ఏజెంట్ పరార్ అయ్యాడు.

నమ్మకంగా ఉంటూ నిండా ముంచాడు.. ఓనర్‌కు భలే షాక్ ఇచ్చిన కలెక్షన్ బాయ్..!
Collection Boy Arrested

Edited By: Balaraju Goud

Updated on: Jun 27, 2025 | 11:33 AM

హైదరాబాద్ మహానగరంలో ఓ కలెక్షన్ బాయ్ వ్యవహారం తన షాప్ యజమానికి హార్ట్ ఎటాక్ తెప్పించేంత పని అయ్యింది. తనని నమ్మి యజమాని పని అప్పచెపితే, తన అవసరం కోసం సోమ్ము చేసుకుని వాడుకున్నాడు. తీరా యజమాని పోలీసులను ఆశ్రయించడంతో కటకటాల పాలయ్యాడు. నమ్మిన బంగారు దుకాణం వ్యాపారికి టోకరా ఇచ్చిన ఉద్యోగి 7లక్షల రూపాయలతో కలెక్షన్ ఏజెంట్ పరార్ అయ్యాడు. నిందితుడిని చాకచక్యంగా అరెస్ట్ చేసిన సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు.. అతడి వద్ద నుండి రూ .6లక్షల 42 వేల రూపాయల నగదు రికవరీ చేశారు.

హైదరాబాద్ పాతబస్తీ శాలిబండ ప్రాంతానికి చెందిన ధనరాజ్ జ్వలరీ షాప్‌లో మొహమ్మద్ అఫ్సర్ కలెక్షన్ ఏజెంట్ గా పని చేస్తున్నాడు. యాజమానితో నమ్మకంగా ఉంటూ బంగారం క్రయవిక్రయాలు చూస్తున్నాడు. ఈ క్రమంలోనే కలెక్షన్ బాయ్‌గా ఉంటూ యాజమానిని మోసం తప్పించుకుని తిరుగుతున్న అఫ్సర్‌ను అరెస్ట్ చేసిన సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు 6లక్షల 42వేల రూపాయలు స్వాధీనం చేసుకుని శాలిబండా పోలీసులకు అప్పగించారు.

ఫలక్ నుమాకి చెందిన మోహమ్మద్ అఫ్సర్ గత ఐదు సంవత్సరాలుగా ధనరాజ్ జ్వలరీ షాపులో కలెక్షన్ ఏజెంట్‌గా పని చేస్తున్నాడు. బేగంబజార్, సిద్దేంబర్ బజార్ లలో బంగారు దుకాణాలలో రోజువారీ కలెక్షన్ చేసి డబ్బును ధనరాజ్ జ్వలరీ షాప్ లో అప్పగిస్తుంటాడు. అలా కొన్ని నెలలుగా పని చేస్తున్న యువకుడు, ఒక్కసారిగా తన ఆలోచన మార్చుకుని ఆ డబ్బును తన అవసరాల కోసం తీసుకోవాలని అనుకున్నాడు.

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మొహమ్మద్ అఫ్సర్ పథకం ప్రకారం బేగంబజార్ లోని పలు జ్వలరీ షాపులలో 7లక్షల రూపాయల వరకు వసూళ్లు చేసి పరారయ్యారు. అఫ్సర్ మోసం గ్రహించిన జ్వలరీ షాప్ యజమాని శాలిబండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేసి 6లక్షల42వేల రూపాయలు స్వాధీనం చేసుకొని రిమైండ్ కి తరలించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..