
Cold Winds In Telangana
హైదరాబాద్, నవంబర్ 20: ఆగ్నేయ బంగాళాఖాతంలో నవంబర్ 22న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. అప్పటి నుంచి వచ్చే 48 గంటల్లో అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశలో కదిలి మరింత బలపడి నవంబర్ 24 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. తదుపరి 48 గంటలలో వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశలో కదిలి మరింత బలపడి నైరుతి బంగాళాఖాతం ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉంది. దీంతో రాగల రెండు, మూడు రోజులు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు మూడు నుండి నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. మెదక్, ఆదిలాబాద్ జిల్లాలలో అక్కడక్కడ తీవ్రమైన చలి గాలిని వీచే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు ఇవే..
- మెదక్ జిల్లాలో అత్యల్పంగా.. 9.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
- ఆదిలాబాద్ జిల్లాలో 9.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు
- పటాన్ చెరువు జిల్లాలో 11 డిగ్రీల ఉష్ణోగ్రతలు
- హనుమకొండ జిల్లాలో 12 డిగ్రీల ఉష్ణోగ్రతలు
- రాజేంద్ర నగర్ జిల్లాలో 13 డిగ్రీల ఉష్ణోగ్రతలు
- నిజామాబాద్ జిల్లాలో 13.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు
- హయత్ నగర్ జిల్లాలో 13.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు
- రామగుండం జిల్లాలో 13.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు
- హైదరాబాద్ జిల్లాలో 14.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు
- దుండిగల్ జిల్లాలో 15.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు
- నల్లగొండ జిల్లాలో 15.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు
- ఖమ్మం జిల్లాలో 16 డిగ్రీల ఉష్ణోగ్రతలు
- హకింపేట్ జిల్లాలో 16 డిగ్రీల ఉష్ణోగ్రతలు
- భద్రాచలం జిల్లాలో 17 డిగ్రీల ఉష్ణోగ్రతలు
- మహబూబ్ నగర్ జిల్లాలో 17.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.