తెలుగు రాష్ట్రాలపై చలి పంజా విసురుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మునుపెన్నడూ లేనంతగా చలి తీవ్రత మరింత పెరిగింది. మరి ముఖ్యంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా చలి వణికిస్తోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే.. గత రెండు రోజులుగా అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏపీలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది.. ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి.. రెండురోజులుగా చలి తీవ్రత పెరగడంతో ప్రజలు బయటకు రావాలంటే జంకుతున్నారు. చలితో వృద్ధులు, చిన్నారులు గజగజ వణుకుతున్నారు.
తెలంగాణలో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.. రెండు రోజులుగా అత్యంత కనిష్ఠానికి ఉష్ణోగ్రతలు పడిపోయాయి.. దీంతో ఉత్తర తెలంగాణ జిల్లాలకు వాతావరణ శాఖ హై అలెర్ట్ జారీ చేసింది. కొమరం భీమ్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.. గరిష్టంగా నల్లగొండ లో 17c నమోదు కాగా.. కనిష్టంగా ఆదిలాబాద్ లో 7.2 c ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..